English   

లావ‌ణ్య త్రిపాఠి.. మిస్సింగ్ బ్యూటీ..

LAVANYA-TRIPATI-MISSING-BEAUTY

ఇదేంటి.. మిస్సింగ్ బ్యూటీ అనే కొత్త బిరుదు ఎందుకు వ‌చ్చింది అనుకుంటున్నారా...? ఇప్పుడు లావ‌ణ్య త్రిపాఠి కెరీర్ ను కాస్త గ‌మ‌నిస్తే చాలు.. ఈ బిరుదు ఎందుకొచ్చిందో అర్థ‌మైపోతుంది. ఎవ‌రైనా ఒక్క సినిమా నుంచి త‌ప్పుకుంటారు.. రెండు సినిమాల నుంచి త‌ప్పుకుంటారు. కానీ లావ‌ణ్య విష‌యంలో మాత్రం ఏదో జ‌రుగుతుంది. ఈ భామ క‌మిటైన సినిమాలన్నీ ఒక్కొక్క‌టిగా ఈమె నుంచి జారిపోతున్నాయి. ఇప్ప‌టికే ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న సినిమా నుంచి ఈమెను త‌ప్పించి క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మండ‌న్న‌ను తీసుకున్నారు. దీనికి కార‌ణం లావ‌ణ్య రెమ్యున‌రేష‌న్ ఎక్కువ‌గా అడ‌గ‌ట‌మే అని తెలుస్తోంది.

ఇక ర‌వితేజ ఇక ట‌చ్ చేసి చూడులోనూ ఈమెను తీసుకుని.. ఆ త‌ర్వాత తీసేసి సీర‌త్ క‌పూర్ ను ఆ స్థానంలోకి తీసుకున్నారు. ఇక తాజాగా మ‌రో సినిమా కూడా లావ‌ణ్య చేతుల్లోంచి వెళ్లిపోయింది. అదే 100 ప‌ర్సెంట్ ల‌వ్ త‌మిళ రీమేక్ నుంచి కూడా లావ‌ణ్య త్రిపాఠిని త‌ప్పించారు. ఆమెను కాద‌ని అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండేను ఎంచుకున్నారు. అన్నింటికీ ఒక‌టే కార‌ణం అని తెలుస్తోంది.. అదే రెమ్యున‌రేష‌న్. అస‌లే మిస్ట‌ర్.. రాధా.. యుద్ధం శ‌ర‌ణం డిజాస్ట‌ర్ల‌తో వెన‌క‌బ‌డిన లావ‌ణ్య త్రిపాఠికి ఇప్పుడు ఈ తీసివేత కార్య‌క్ర‌మం మ‌రింత శాపంగా మారింది.

More Related Stories