English   

మ‌హాన‌టి.. అంద‌రి సొత్తు ఆ చ‌రిత్ర‌.. 

Mahanati-Title-Logo-Launched

సావిత్రి జీవితం అంటే కొంద‌రి సొత్తు కాదు.. అది అంద‌రు తెలుగు వాళ్ల హ‌క్కు. ఈమె జీవితం తెరిచిన పుస్త‌కం. ఇప్పుడు ఆ తెరిచిన పుస్త‌కానికి తెర‌రూపం ఇస్తున్నాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఈ తెర‌రూపాన్ని క‌నులారా చూడాలని కోరుకోని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండడేమో అంత అతిశ‌యోక్తి కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడికి రాని ఆలోచ‌న నాగ్ అశ్విన్ కు వ‌చ్చింది. వ‌చ్చిందే త‌డువుగా సావిత్రి జీవితంపై మ‌హాన‌టి సినిమా మొద‌లు పెట్టాడు. అది కూడా ఏదో ఆషామాషీగా కాదు. పెద్ద పెద్ద స్టార్స్ ను పెట్టుకుని.. ఒకే సినిమా అనుభ‌వం ఉన్న నాగ్ అశ్విన్ చేస్తోన్న మ‌హాయ‌జ్ఞం ఈ మహాన‌టి. డిసెంబ‌ర్ 6న సావిత్రి జ‌యంతి కానుక‌గా మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు చిత్ర‌యూనిట్. మోష‌న్ పోస్ట‌ర్ లోనే కావాల్సినంత కొత్త‌ద‌నం చూపించాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్.

మాయాబ‌జార్ లో ఉండే మ్యాజిక్ మిర్ర‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ సినిమా చూసిన వాళ్లెవ్వ‌రికైనా దాని గురించి తెలుస్తుంది. ఇప్పుడు మోష‌న్ పోస్ట‌ర్ కోసం కూడా ఇదే వాడుకున్నాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. మాయాబజార్ సెట్ లోకి సావిత్రి పాత్ర‌ధారి అయిన కీర్తిసురేష్ వ‌చ్చి.. బాక్సు తెర‌వ‌గానే అందులోంచి సావిత్రి స్వ‌రంతో కూడిన కొన్ని డైలాగులు.. పాట‌లు వ‌స్తాయి. త‌ర్వాత కొన్ని క‌థ‌లు చ‌రిత్రే.. వాటికి అంతం ఉండ‌దంటూ రాసుంటుంది. వెంట‌నే మ‌హాన‌టి అంటూ టైటిల్ వ‌స్తుంది. ఇదంతా చూస్తుంటే సినిమా ఎంత విజువ‌ల్ వండ‌ర్ గా ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. చిన్న మోష‌న్ పోస్ట‌ర్ కే ఇంత‌గా ఆస‌క్తి రేకెత్తిస్తే.. రేపు సినిమా విష‌యంలో నాగ్ అశ్విన్ ఇంకెంత జాగ్ర‌త్త తీసుకుని ఉంటాడో మ‌రి..! ఈ చిత్రం వ‌చ్చే ఏడాది మార్చ్ 29న విడుదల కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఆ రోజు రంగ‌స్థ‌లం కూడా రానుంది. కానీ మ‌రి చివ‌రివ‌ర‌కు రంగ‌స్థ‌లం ఉంటుందో లేదంటే ముందే వ‌స్తుందో చూడాలిక‌..!

More Related Stories