English   

మ‌హానటిలో అర్జున్ రెడ్డి బ్యూటీ..

Mahanatilo-Arjun-Reddy-Beaty

సావిత్రి బ‌యోపిక్ గా మ‌హాన‌టి సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. కీర్తిసురేష్ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. సావిత్రి పాత్ర కోసం ఆమె బ‌రువు కూడా పెరిగింది. ఇక ఇదే చిత్రంలో స‌మంత కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. ఈమె సావిత్రి జీవితాన్ని ప్రేక్ష‌కుల‌కు చూపించే జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. ఇప్పుడు మ‌రో హీరోయిన్ కూడా మ‌హాన‌టిలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఆమె మ‌రెవ‌రో కాదు అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే. ఈమె కూడా సావిత్రి బ‌యోపిక్ లో ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే షాలిని పోషించే పాత్రేంటి..? ఎవ‌రి కారెక్ట‌ర్ లో ఈమె క‌నిపించ‌బోతుంద‌నే విష‌యాలు మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. వ‌చ్చే ఏడాది మ‌హానటి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More Related Stories