English   

మహానుభావుడు.. ఫుల్ కామెడీ ప‌రుషుడు..

Mahanubhavudu-Full-Comedy-Purushudu

కొన్నిసార్లు త‌క్కువ అంచ‌నాల‌తో వ‌చ్చిన సినిమాలే దుమ్ము లేపేస్తుంటాయి. ఈ లిస్ట్ లో సైలెంట్ కిల్ల‌ర్ అనే బిరుదుతో ఎప్పుడూ సిద్ధంగా ఉండే హీరో శ‌ర్వానంద్. ఈయ‌న స్టార్స్ తోనే యుద్ధానికి దిగుతానంటాడు. అలా పోటీ ప‌డి గెల‌వ‌డ‌మే త‌న‌కు ఇష్టం అంటాడు. ఇప్ప‌టికే జై ల‌వ‌కుశ వ‌చ్చింది. ఇప్పుడు స్పైడ‌ర్ కూడా రాబోతుంది. ఈ రెండింటి మ‌ధ్య మ‌హానుభావుడు అంటూ వ‌స్తున్నాడు శ‌ర్వానంద్. ఈ చిత్ర సెన్సార్ పూర్తైంది. సినిమా చాలా స‌ర‌దా స‌ర‌దాగా ఉంటుంద‌ని.. భ‌లేభ‌లే మ‌గాడివోయ్ త‌ర‌హాలోనే కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అని చెబుతున్నారు సెన్సార్ స‌భ్యులు. బాబు బంగారంతో కాస్త గాడి త‌ప్పిన మారుతి.. మ‌హానుభావుడుతో ట్రాక్ ఎక్కాడ‌ని అంటున్నారంతా.

ర‌న్ రాజా ర‌న్, ఎక్స్ ప్రెస్ రాజా త‌ర్వాత యువీ క్రియేష‌న్స్ లో శ‌ర్వా చేస్తోన్న మూడో సినిమా ఇది. అతిశుభ్రం అనే డిసీజ్ ఉన్న అబ్బాయి.. మిడిల్ క్లాస్ అమ్మాయి ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుంది అనేది మ‌హానుభావుడు కాన్సెప్ట్. ప్ర‌తీదీ నీట్ గా ఉండాల‌నుకునే అబ్బాయి.. ఆ అమ్మాయి ప్రేమ‌ను పొందాడా లేదా అనే ఆస‌క్తిక‌ర‌మైన కాన్సెప్ట్ ను తీసుకున్నాడు మారుతి. సెప్టెంబ‌ర్ 29న ఈ చిత్రం విడుద‌ల కానుంది. స్పైడ‌ర్ సినిమా వ‌చ్చిన రెండు రోజుల త‌ర్వాత రానుండ‌టం ఈ చిత్రానికి క‌లిసి రానుంది. మ‌హేశ్ సినిమాకు ఏ మాత్రం తేడా టాక్ వ‌చ్చినా మ‌హానుభావుడు రెచ్చిపోవ‌డం ఖాయం. ఒక‌వేళ స్పైడ‌ర్ హిట్టైనా కూడా త‌న క‌లెక్ష‌న్లు మాత్రం తాను ప‌ట్టుకెళ్ళిపోతాడు ఈ మ‌హానుభావుడు. ఎటు చూసుకున్నా కూడా శ‌ర్వా సేఫ్ జోన్ లో ఉన్నాడు.

More Related Stories