English   

మ‌హేశ్-బాల‌య్య‌.. క‌లిపే దుమ్ముందా..? 

Mahesh-Babu-And-Balakrishna-s-Multistarrer-With-Boyapati

ఈ కాంబినేష‌న్ విన‌డానికే చాలా విచిత్రంగా ఉంది క‌దా..! కానీ అన్నీ కుదిర్తే తెలుగులో ఈ సీజ‌న్ కే బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ వ‌చ్చే టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డింది. మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం కొర‌టాల శివతో భ‌ర‌త్ అను నేను చేస్తున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత వంశీ పైడిప‌ల్లితో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ రెండు సినిమాల త‌ర్వాత బోయ‌పాటితో సినిమా చేయ‌బోతున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో కేవ‌లం మ‌హేశ్ మాత్ర‌మే కాదు.. మ‌రో సూప‌ర్ స్టార్ కూడా న‌టించ‌బోతున్నాడు. ఆయ‌నే బాల‌కృష్ణ‌. ఇప్ప‌టికే బోయ‌పాటి శీను.. ఈ మ‌ధ్యే బాల‌య్య న‌టిస్తోన్న జై సింహా సెట్స్ కు వెళ్లి క‌థ కూడా చెప్పొచ్చాడ‌ని స‌మాచారం. దాదాపు బాల‌య్య వైపు నుంచి కూడా క‌థ‌కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చిన‌ట్లే అని తెలుస్తోంది. ఎలాగూ బోయ‌పాటితో బాల‌య్య కాంబినేష‌న్ అన‌గానే అంచ‌నాలు కూడా భారీ రేంజ్ లో ఉంటాయి.

ఒక‌వేళ నిజంగా బాల‌య్య‌-మ‌హేశ్ కాంబినేష‌న్ గ‌న‌క క‌లిస్తే టాలీవుడ్ లో ఇంత‌కంటే బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ మ‌రోటి ఉండ‌దేమో. ఇప్ప‌టికే రాజ‌మౌళి కూడా చ‌ర‌ణ్-ఎన్టీఆర్ తో ఓ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో మ‌హేశ్-బాల‌య్య సినిమా వ‌స్తే ఇంక రికార్డులు బ‌ద్ధ‌లే. అసలే బాల కృష్ణ‌కు మాస్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంటుంది.. ఇక మ‌హేశ్ సంగ‌తి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఇద్ద‌రూ క‌లిస్తే బాక్సాఫీస్ బ‌ద్ధ‌లే. మ‌రోవైపు బోయ‌పాటి శీను కూడా ఎలాంటి ప‌వ‌ర్ ఫుల్ క‌థ‌లు రాస్తాడో అంద‌రికీ తెలిసిందే. ఇలాంటి ద‌ర్శ‌కుడు బాల‌య్య కోసం క‌థ రాస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక అదే సినిమాలో మ‌హేశ్ కూడా ఉంటాడంటే అభిమానుల‌కు పండ‌గే. చూడాలిక‌.. ఈ కాంబినేష‌న్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో..?

More Related Stories