English   

మ‌హేశ్ వ‌స్తున్నాడు.. గెట్ రెడీ..

Mahesh-Babu-Back-To-India

మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం యుఎస్ లో ఉన్నాడు. ఈయ‌న సినిమా సినిమాకు మాత్ర‌మే కాదు.. మ‌ధ్య‌లో కూడా బ్రేక్ తీసుకుంటాడు. ఈ మ‌ధ్యే యాడ్ షూటింగ్ కోసం యుఎస్ వెళ్లాడు సూప‌ర్ స్టార్. అక్క‌డే కొన్ని రోజులుగా ఉంటున్నాడు. క్యాషినోలో ఎంజాయ్ చేస్తున్నాడు. యాడ్ కోసం వెళ్లినా.. త‌నతో పాటు ఫ్యామిలీని కూడా తీసుకెళ్లాడు మ‌హేశ్. ఫారెన్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే యాడ్ షూటింగ్ పూర్త‌యింది. దాంతో మ‌రో రెండ్రోజుల్లో ఇండియా రానున్నాడు మ‌హేశ్. న‌వంబ‌ర్ 23న ఈయ‌న హైద‌రాబాద్ కు వ‌స్తాడు. వ‌చ్చిన వెంట‌నే భ‌ర‌త్ అనే నేను షూటింగ్ తో బిజీ కానున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే స‌గానికి పైగా పూర్త‌యింది.

కొర‌టాల శివ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం ఎప్రిల్ 27న విడుద‌ల కానుంది. కైరాఅద్వాని హీరోయిన్ గా న‌టిస్తుంది. మ‌హేశ్ లేక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం టీంకు కూడా హాలీడేస్ ఇచ్చాడు కొర‌టాల శివ. న‌వంబ‌ర్ 24న పొల్లాచ్చిలో కొత్త షెడ్యూల్ మొద‌లు కానుంది. అక్క‌డే హోలీ నేప‌థ్యంలో భారీ ఫైట్ ఒక‌టి ప్లాన్ చేస్తున్నాడు కొర‌టాల. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ 60 శాతం పూర్తైన‌ట్లే. ఇందులో మ‌హేశ్ పాత్ర ఇప్ప‌టి రాజ‌కీయ నాయ‌కుల‌ను పోలి ఉంటుంద‌ని తెలుస్తోంది. అంతేకాదు.. భ‌ర‌త్ అనేనేనులో విద్యావ్య‌వ‌స్థ‌లో జ‌రిగే లోటుపాట్ల‌ను ఎత్తి చూపించ‌బోతున్నాడు కొర‌టాల‌. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు.. ఆశ‌లు పెట్టుకున్నాడు సూప‌ర్ స్టార్. వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న మ‌హేశ్ కు భ‌ర‌త్ అనే నేను విజ‌యం త‌ప్ప‌నిస‌రి. మొత్తానికి చూడాలిక‌.. భ‌ర‌త్ ఎలా ఉండ‌బోతున్నాడో..?

More Related Stories