English   

మ‌హేశ్ ను మ‌ళ్లీ ప‌రిగెత్తించారుగా..

Mahesh-Babu-Latest-Running-Poster-Is-Out

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మెడ‌పై చెయ్యేస్తే ఆటోమేటిక్ గా విజిల్స్ ప‌డిపోతాయి.. ర‌జినీకాంత్ ఒక్క‌సారి చెబితే అంటూ స్టైల్ గా సిగ‌రెట్ కాలిస్తే ర‌చ్చ ర‌చ్చే.. ఇక చిరు స్టెప్పులు ఆరేళ్ల నుంచి అర‌వై వ‌ర‌కు ఊగిపోవాల్సిందే. ఇలా ఒక్కో హీరోకు ఒక్కో సిగ్నేచ‌ర్ ఉంటుంది. అలాగే మ‌హేశ్ కు కూడా ఒక‌టి ఉంది. అదే ర‌న్నింగ్. ఒక్క‌సారి ఊహించుకోండి మ‌హేశ్ ప‌రిగెత్తితే ఎలా ఉంటుంది..? అస‌లు టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే మ‌హేశ్ కంటే అందంగా ప‌రిగెత్తే స్టార్ మ‌రొక‌రు లేరు. అందుకే ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా.. సినిమా ఏదైనా.. క‌థ ఎలా ఉన్నా.. సినిమాలో ఒక్క‌టైనా ర‌న్నింగ్ సీన్ ఉంటుంది.

క‌థ‌లో లేక‌పోతే.. కేవ‌లం మ‌హేశ్ ప‌రిగెత్త‌డం కోస‌మైనా ఆ సీన్ రాసుకుంటారు ద‌ర్శ‌కులు. అంత‌గా మ‌హేశ్ ర‌న్నింగ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు స్పైడ‌ర్ లోనూ మ‌హేశ్ అదిరిపోయే ర‌న్నింగ్ సీన్ ఒక‌టుంది. ట్రైల‌ర్ లో.. టీజ‌ర్ లో ఇప్ప‌టికే అది క‌నిపించింది. ఇక ఇప్పుడు పోస్ట‌ర్స్ లోనూ దాన్నే విడుద‌ల చేసాడు ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్. ఈ ర‌న్నింగ్ సీన్ చూస్తుంటే రికార్డుల‌ను సూప‌ర్ స్టార్ ఎంత వేగంగా కొట్ట‌డానికి వ‌స్తున్నాడో అనిపిస్తుంది.

More Related Stories