English   

చిరు.. ర‌జినీపై మ‌హేశ్ క‌మెంట్.. 

Mahesh-Comments-On-Chiru-And-Rajinikanth

త‌న స్టార్ ఇమేజ్ ను ప‌క్క‌న‌బెట్టి మ‌రో స్టార్ హీరోను పొగ‌డాలంటే కూడా ఇగో అడ్డొస్తుంది. కానీ కొన్నిసార్లు కొంద‌రు హీరోలు మాత్రం అవ‌న్నీ ప‌ట్టించుకోకుండా.. ప‌క్క‌న‌బెట్టేసి ఇత‌ర హీరోల‌ను కూడా పొగిడేస్తుంటారు. ఇప్పుడు మ‌హేశ్ కూడా అదే ప‌ని చేసాడు. ఈయ‌న ప్ర‌స్తుతం చెన్నైలో స్పైడ‌ర్ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నాడు. అక్క‌డ ఓ విలేఖ‌రి ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న అడిగాడు మ‌హేశ్ ను. మీరు సూప‌ర్ స్టార్ క‌దా.. ఆ స్టేట‌స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటే మ‌హేశ్ దిమ్మ‌తిరిగేపోయే స‌మాధానం ఇచ్చాడు. అది జ‌నాలు ఇచ్చిన స్టార్ స్టేట‌స్ కానీ తాను అలా ఫీల్ కాన‌ని.. నిజానికి సూప‌ర్ స్టార్ అనే ప‌ద‌మే త‌న‌కు వ‌ద్దని చెబుతుంటానంటున్నాడు మ‌హేశ్. అది చూస్తే భ‌య‌మేస్తుందంటున్నాడు మ‌హేశ్.

త‌న దృష్టిలో రియ‌ల్ సూప‌ర్ స్టార్స్ అంటే చిరంజీవి.. ర‌జినీకాంత్ గారే అంటున్నాడు మ‌హేశ్. వాళ్ల సినిమాల‌కు టాక్ తో ప‌ని లేకుండా థియేట‌ర్స్ కు ప్రేక్ష‌కులు వ‌స్తారు.. అది స్టార్ ఇమేజ్ అంటే.. త‌న దృష్టిలో నటుడి కంటే స్టార్ కంటే సినిమానే గొప్పది.. క‌థ బాగుంటేనే ఎవ‌రైనా స్టార్ కావ‌చ్చంటున్నాడు మ‌హేశ్ బాబు. మొత్తానికి చిరంజీవి, ర‌జినీకాంత్ స్టార్ ఇమేజ్ పై మ‌హేశ్ చేసిన క‌మెంట్స్ పై అంత‌టా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.

More Related Stories