English   

మ‌హేశ్ కు త‌మిళ‌నాట పాలాభిషేకాలు.. 

Mahesh-Ku-Tamilnata-Palabishekaalu

తెలుగులో మ‌హేశ్ కు తిరుగులేదు.. ఇక్క‌డ ఆయ‌న ఫ్యాన్ బేస్ గురించి ఏం చెబుతాం.. సూప‌ర్ స్టార్ ఆయ‌న‌. కానీ త‌మిళ‌నాట మాత్రం మ‌హేశ్ ఇంకా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. అక్క‌డ స్పైడ‌ర్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నా.. ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరేమో అనుకున్నారంతా. కానీ స్పైడ‌ర్ ఆడియో వేడుక‌కు వ‌చ్చిన రెస్పాన్స్ చూసిన త‌ర్వాత అంతా క‌ళ్లు బైర్లు గ‌మ్మేసాయి. అస‌లు  మనం చూస్తున్న‌ది త‌మిళ ఆడియోనా.. తెలుగులోనా అని ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌దు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగిన‌ప్ప‌టి నుంచి స్పైడ‌ర్ ఆడియో ఈవెంట్ జ‌రిగే ఆడిటోరియం వ‌ర‌కు ఫ్యాన్స్ బైక్ ర్యాలీ చేసారు. అక్క‌డ మ‌హేశ్ క‌టౌట్ కు కూడా పాలాభిషేకాలు చేసారు. త‌మ అభిమాన హీరోల‌కు పాలాభిషేకం చేయ‌డం అక్క‌డి వాళ్ల‌కు అల‌వాటు. ఆ లిస్ట్ లో ఇప్పుడు మ‌హేశ్ కూడా చేరిపోయాడు. పెద్ద ఆడిటోరియంలో ప్లాన్ చేసారు ఈ ఆడియోను. అదంతా నిండిపోవ‌డం.. మ‌హేశ్ మ‌హేశ్ అంటూ అర‌వ‌డం.. ఇవ‌న్నీ చూస్తుంటే అర‌వ‌నేల‌పై స్పైడ‌ర్ తో జెండా పాతేలాగే క‌నిపిస్తున్నాడు సూప‌ర్ స్టార్. ఎందుకైనా మంచిది.. అక్క‌డి హీరోలు కూడా కాస్త జాగ్ర‌త్త‌గా ఉంటే మంచిదేమో..?

More Related Stories