English   

మ‌హేశ్ త‌ప్ప హీరో లేడా మురుగ‌దాస్ గారు..? 

Mahesh-Tappa-Hero-Leda-Murugadoss-Garu

ఒక్కోసారి ద‌ర్శ‌కులు తాము ప‌నిచేసిన హీరోల గురించి చెబుతూ నోరు జారుతుంటారు. ఇప్పుడు మురుగ‌దాస్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. స్పైడ‌ర్ సినిమా గొప్ప‌త‌నం.. మ‌హేశ్ బాబు గొప్ప‌త‌నం గురించి చెప్పే స‌మ‌యంలోనే తెలియ‌కుండానే ఒక‌ట్రెండు సంచ‌ల‌న విష‌యాలు కూడా బ‌య‌ట‌పెట్టేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ త‌రం హీరోల్లో మ‌హేశ్ కంటే గొప్ప న‌టుడు ఎవ‌రూ లేర‌ని.. తాను ప‌ని చేసిన హీరోల్లో ఓపిక ఎక్కువ‌గా ఉన్న  హీరో ఇత‌నే అని చెప్పేసాడు మురుగ‌దాస్. పైగా ఎన్ని రోజులు నైట్ షూట్ చేసినా క‌నీసం ఒక్క మాట కూడా మాట్లాడ‌లేద‌ని.. ఎప్పుడు ర‌మ్మంటే అప్పుడు షూట్ కు వ‌చ్చాడ‌ని.. తాను అంత పెద్ద సూప‌ర్ స్టార్ అయినా కూడా ఎక్క‌డా ఆ ఆటిట్యూడ్ చూపించ‌లేద‌ని పొగిడాడు మురుగ‌దాస్. ఈ ద‌ర్శ‌కుడు ఇంత‌గా చెబుతుంటే.. ఇన్నాళ్లూ ఆయ‌న‌తో ప‌నిచేసిన ప‌క్క హీరోల‌కు ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయా అనే అనుమానం రాక మానదు. మొత్తానికి మ‌హేశ్ ను పొగిడే క్ర‌మంలో ఎప్పుడూ వివాదంలో ఇరుక్కోని మురుగ‌దాస్.. తొలిసారి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అయ్యారు వేడుక‌లో. మ‌రి ఈయ‌న చెప్పినంత రేంజ్ లో రేపు సినిమా కూడా మాట్లాడుతుందో లేదో చూడాలిక‌..!

More Related Stories