English   

మ‌న‌సుకు న‌చ్చేలా ఉందే..!

Manasuku-Nachindi

సందీప్ కిష‌న్ మ‌రో సినిమాతో వ‌చ్చేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ సినిమాల‌తో వ‌చ్చిన ఈ హీరో.. ఇప్పుడు వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లో ద‌ర్శ‌నం ఇస్తున్నాడు. ఈయ‌న న‌టించిన మ‌న‌సుకు న‌చ్చింది ట్రైల‌ర్ విడుద‌లైంది. మంజుల తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అమైరా ద‌స్తూర్, త్రిదా చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు. న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీగా ఈ చిత్రం తెర‌కెక్కించింది మంజుల‌. ట్రైల‌ర్ చూస్తుంటే క‌చ్చితంగా యూత్ ను టార్గెట్ చేసిన‌ట్లుగా అర్థ‌మైపోతుంది. హీరోయిన్ల అందాల ఆర‌బోత ట్రైల‌ర్ లో బాగానే హైలైట్ చేసారు. పైగా త్రిదాచౌద‌రి బికిని కూడా వేసింది ఈ చిత్రంలో. ఇక సందీప్ కిష‌న్, అమైరా మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సీన్స్ కూడా సినిమాపై బాగానే ఆస‌క్తి పెంచేస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రేమ‌లు, పెళ్లిళ్లు ఎలా ఉంటున్నాయ‌నే కాన్సెప్ట్ తోనే ఈ చిత్రం తెర‌కెక్కించింది మంజుల‌. టైటిల్ కూడా సింపుల్ గా ఉండేలా మ‌న‌సుకు న‌చ్చింది అని పెట్టింది. జ‌న‌వ‌రి 26న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ చిత్రంతో అయినా ఒక్క హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు సందీప్ కిష‌న్. మ‌రి ఈయ‌న ఆశ‌లు ఇప్ప‌టికైనా తీరేనో లేదో..? 

More Related Stories