English   

మ‌ణిక‌ర్ణిక కాన్సెప్ట్ అదిరింది..

Manikarnika-Concept-Revealed

క్రిష్ రెండో బాలీవుడ్ సినిమా మ‌ణిక‌ర్ణిక షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. కొన్ని నెల‌ల కింద వార‌ణాసి ఒడ్డున ఈ సినిమా ముహూర్తం జ‌రిగింది. ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జ‌న్మించిన గ‌డ్డ‌పైనే మ‌ణిక‌ర్ణిక షూటింగ్ మొద‌లు పెట్టాడు క్రిష్. నాటి నుంచి నేటి వ‌ర‌కు సినిమాను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేస్తున్నాడు. మ‌ధ్య‌లో కంగ‌న ర‌నౌత్ కు యాక్సిడెంట్ కావ‌డంతో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన క్రిష్.. ఇప్పుడు మ‌ళ్లీ షూటింగ్ లో జోరు పెంచేసాడు. 1828లో కాశీలోనే ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జ‌న్మించింది. ఆమె జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. బాహుబ‌లి పుణ్య‌మా అని ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ రేంజ్ మారిపోయింది. బాలీవుడ్ లో కూడా ఇప్పుడు తెలుగు టెక్నీషియ‌న్లు అంటే గౌర‌వం పెరిగిపోయింది. వాళ్లను పిలిచి మ‌రీ వ‌ర్క్ చేయించుకుంటున్నారు అక్క‌డి ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఇక ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. కంగ‌న ర‌నౌత్ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌ణిక‌ర్ణిక కోసం బాలీవుడ్ లో అంత‌మంది ద‌ర్శ‌కుల‌ను వ‌దిలేసి మ‌న క్రిష్ ను ఎంచుకుంది. ఇక ఈ సినిమాకు మ‌రో తెలుగు వాడు కూడా ప‌ని చేస్తున్నాడు అత‌డే రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్. మ‌ణిక‌ర్ణిక సినిమాకు క‌థ అందించింది ఆయ‌నే. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జీవితాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత సినిమా రేంజ్ ఎలా ఉండ‌బోతుందో అర్థ‌మ‌వుతుంది. ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ గుర్రంపై ఉంటూ శ‌త్రువుల‌ను చీల్చి చెండాడుతున్న ఈ ఫోటో అదిరిపోయిందంతే. 2018 ఎప్రిల్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ఇద్ద‌రు తెలుగు వాళ్లు క‌లిసి బాలీవుడ్ లో ఎలాంటి మాయ చేస్తారో చూడాలిక‌..

More Related Stories