English   

సూప‌ర్ నాని.. క్యూట్ సాయిప‌ల్ల‌వి..

MCA-Teaser-Is-Out

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ ఏంటి..? ఇప్ప‌టికే చాలా సినిమాలు వ‌చ్చాయి. ఇక‌పై రాబోయే సినిమాల్లో ఏది మోస్ట్ అవైటెడ్ అనుకుంటున్నారు అని గానీ ఓ కాంటెస్ట్ ర‌న్ చేస్తే నూటికి తొంబై మంది చెప్పే పేరు ఎంసిఏ. నాని హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ వేగంగా జ‌రుగుతుంది. నాని ఏదో హిట్ల‌లో ఉన్నాడ‌ని ఎంసిఏ అవైటెడ్ మూవీ కాదు. ఈ చిత్రానికి మ‌రో స్పెషాలిటీ కూడా ఉంది. సాయిప‌ల్ల‌వి అనే బ్రాండ్. అవును.. నాని న్యాచుర‌ల్ స్టార్.. సాయిప‌ల్ల‌వి చుల‌ర్ యాక్ట‌ర్.. ఈ ఇద్ద‌రూ కలిస్తే ఇక స్క్రీన్ షేక్ అయిపోదా..? ఇప్పుడు ఓ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఇలాగే వేచి చూస్తున్నారు. అదే ఎంసిఏ. నాని హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని వేణు శ్రీ‌రామ్ తెర‌కెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత‌. టీజ‌ర్ లో కూడా ఈ ఇద్ద‌రి కెమిస్ట్రి చూసి అంతా ఫిదా అయిపోతున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. డిసెంబ‌ర్ 15న‌ ఎంసిఏ విడుద‌ల కానుంది. ఇందులో సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టిస్తుంది. నానితో ఈమె జోడీ క‌ట్ట‌డం తొలిసారి. ఇప్ప‌టికే ఫిదాతో సాయిప‌ల్ల‌వి తెలుగు ఇండ‌స్ట్రీని ఫిదా చేసింది. ఇప్పుడు ఈమె సినిమాల‌పై ప్రేక్ష‌కుల్లో కూడా ఆస‌క్తి బాగా పెరిగిపోయింది. ఒక్క సినిమాతోనే.. ఇంకా చెప్పాలంటే తొలి సినిమాతోనే సాయిప‌ల్ల‌వికి అభిమానులు కూడా వ‌చ్చేసారు. ఇలాంటి టైమ్ లో త‌న న్యాచుర‌ల్ యాక్టింగ్ తో ఫిదా చేసిన సాయిప‌ల్ల‌వి.. న్యాచుర‌ల్ స్టార్ తో ఎలా రెచ్చిపోయిందో అని ఆస‌క్తిగా చూస్తున్నారు. ఒకే తెర‌పై ఇటు నాని.. అటు సాయిప‌ల్ల‌విని చూస్తుంటే అబ్బో చూసేవాళ్ల‌కు పండ‌గే పండ‌గ‌.

పైగా ఎంసిఏ ప్రీ రిలీజ్ బిజినెస్ 25 కోట్ల వ‌ర‌కు జ‌రుగుతుంది. ఈ చిత్రం క‌చ్చితంగా 40 కోట్ల మార్క్ అందుకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు చిత్ర‌యూనిట్. డిసెంబ‌ర్ లో మరో సినిమా కూడా పోటీ లేక‌పోవ‌డంతో నాని జోరుకు బ్రేకులు వేసే వారే లేరు. డిసెంబ‌ర్ 22న అఖిల్ హ‌లో వ‌స్తున్నా కూడా నాని స్పీడ్ కు ఎంత‌వ‌ర‌కు బ్రేకులేస్తాడ‌నేది చూడాలిక‌..! మొత్తానికి టీజ‌ర్ తో ర‌ప్ఫాడించిన ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి రేపు సినిమాలో ఇంకా ఎంత మాయ చేస్తాడో చూడాలిక‌..!

More Related Stories