English   

మెగా క్యాంప్ లో తేలిన శ్రీ‌కాంత్..

Mega-Camp-Lo-Telina-Srikanth

శ్రీ‌కాంత్ ఇప్పుడు కొత్త‌గా మెగా క్యాంప్ లో తేల‌డం ఏంటి.. ఎప్ప‌ట్నుంచో ఆయ‌న కేరాఫ్ మెగా ఫ్యామిలీనే క‌దా అనుకుంటున్నారా..? ఇక్క‌డ మ‌నం మాట్లాడుకుంటున్న‌ది ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల గురించి. స‌రిగ్గా ఏడాదిన్న‌ర‌ కింది వ‌ర‌కు ఈ పేరు టాలీవుడ్ లో బాగా వినిపించింది. మ‌హేశ్ బాబు లాంటి స్టార్ హీరోతో రెండోసారి అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం అంటే మాట‌లు కాదు. ఎంతో న‌మ్మితే గానీ ఆయ‌న మ‌రో అవ‌కాశం ఇవ్వ‌డు. రెండోసారి అవ‌కాశ‌మిస్తే ద‌ర్శ‌కులు ఆయ‌న్ని ముంచేస్తున్నారు అది వేరే విష‌యం. ఇప్పుడు శ్రీ‌కాంత్ అడ్డాల కూడా ఇదే చేసాడు. బ్ర‌హ్మోత్స‌వంతో మ‌హేశ్ కు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని డిజాస్ట‌ర్ ని ఇచ్చాడు శ్రీ‌కాంత్ అడ్డాల‌.

త‌న‌కే అర్థ‌మ‌య్యే డైలాగ్స్.. ప్రేక్ష‌కుల‌కు అర్థం కాని సీన్ల‌తో చిరాకు పుట్టించాడు. బ్ర‌హ్మోత్స‌వం సినిమాపై భారీ ఆశ‌లు పెట్టుకున్న శ్రీ‌కాంత్ అడ్డాల‌కి ఆ సినిమా కోలుకోలేని దెబ్బ తీసింది.
బ్ర‌హ్మోత్స‌వం ఫ్లాప్ కు క‌ర్త క‌ర్మ క్రియ అన్నీ శ్రీ‌కాంత్ అడ్డాలే. సీత‌మ్మ వాకిట్లో లాంటి హిట్టిచ్చాడ‌నే న‌మ్మ‌కంతో క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు అన్నీ ఆయ‌న‌పైనే గుడ్డిగా వ‌దిలేసాడు సూప‌ర్ స్టార్. కానీ ఈ సినిమాకు ఆయ‌న ప‌డిన క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరైంది.

పైగా మ‌హేశ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసాడంటూ ఇప్పుడు శ్రీ‌కాంత్ అడ్డాల‌పై చివాట్లు కూడా ప‌డుతున్నాయి. ఈ సినిమా వ‌చ్చి నెల‌లు గ‌డుస్తున్నా క‌నీసం శ్రీ‌కాంత్ పేరు వినిపించ‌ట్లేదు. ఇంత‌కుముందు ముకుంద లాంటి ప్లాప్ ఇచ్చినా అది మంచి సినిమా అంటే ఓ వ‌ర్గం ప్రేక్ష‌కులు మెచ్చుకున్నారు. కానీ కెరీర్ లో ఫ‌స్ట్ టైమ్ చెత్త సినిమా చేసాడంటూ ఈ ద‌ర్శ‌కున్ని విమ‌ర్శిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఈయ‌న‌కు త‌ర్వాతి సినిమా ఇచ్చే ధైర్యం ఏ హీరో చేస్తాడు..? అయితే ఇప్ప‌టికే మెగా కంపౌండ్ లో శ్రీ‌కాంత్ అడ్డాల‌కు ఓ అవ‌కాశం వ‌చ్చింది. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఓ సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు శ్రీ‌కాంత్. ఈ చిత్రం బ‌న్నీతో ఉంటుందా.. లేదంటే శిరీష్ తో ఉంటుందా అనేది మాత్రం తెలియ‌దు. ఇలాంటి టైమ్ లో గీతాఆర్ట్స్ లో సినిమా అంటే ప్రపంచంలో శ్రీ‌కాంత్ కంటే అదృష్ట‌వంతుడు మ‌రొక‌రు ఉండ‌రేమో..?

More Related Stories