English   

సైరా కోసం అన్న‌య్య అదుర్స్..

Megastar-Chiranjeevi-New-Look-Fantastic

ఒక్క‌సారి సినిమాల్లోకి రావాల‌ని ఫిక్సైపోయిన త‌ర్వాత త‌న కోసం తాను చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు చిరంజీవి. అస‌లు ఇదివ‌ర‌కు మ‌నం చూసిన చిరుకు ఇప్పుడు మ‌నం చూస్తున్న చిరుకు చాలా తేడా ఉంది. ఖైదీ నెంబర్ 150 కోసం చాలా స‌న్న‌గా మారిపోయిన చిరంజీవి.. ఇప్పుడు సైరా కోసం మ‌రింత‌గా లుక్ మార్చేసాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్క‌నున్న చిత్రం కావ‌డంతో ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్లు త‌న‌ను తాను సిద్ధం చేసుకుంటున్నాడు మెగాస్టార్. ఇప్పటికే సినిమా ప‌ట్టాలెక్కాల్సి ఉన్నా అనుకోని కార‌ణాల‌తో ఆల‌స్యం అవు తూనే ఉంది. ముఖ్యంగా చారిత్రాత్మ‌క పాత్ర కావ‌డంతో లుక్ విష‌యంలో ఎలాంటి విమ‌ర్శ‌లు రాకూడ‌ద‌ని ముందు నుంచే జాగ్ర‌త్త‌లు తీసుకుంటు న్నాడు చిరు. సైరా సినిమా కోసం చిరు ఫిటెనెస్ లెవ‌ల్స్ పీక్స్ లో ఉన్నాయి. తాజాగా విడుద‌లైన లుక్ చూస్తుంటేనే ఈ పాత్ర కోసం చిరంజీవి ఎంత‌గా క‌స‌ర‌త్తులు చేస్తున్నారో అర్థ‌మైపోతుంది.

డిసెంబర్ 6 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొద‌లుపెట్టాల‌ని ఆలోచిస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక సెట్‌లో సినిమా మొదటి షెడ్యూల్ జరుగనుంది. నిర్మాత రామ్ చరణ్ దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. 63 ఏళ్ల వ‌య‌సులోనూ ఈ పాత్ర కోసం అహ‌ర్నిష‌లు క‌ష్ట‌ప‌డుతున్నాడు మెగాస్టార్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు సరిపడా బాడీ షేప్‌ను చిరు ఇప్పటికే పొందినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు.. యుద్ధ విద్య‌లు, గుర్ర‌పుస్వారీ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటు న్నాడు చిరంజీవి. వీటితోపాటు క‌త్తిసాములోనూ ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్నాడు మెగాస్టార్. మొత్తానికి 60 ఏళ్లు దాటిన త‌ర్వాత యోధుడిగా మార‌డానికి కంటిమీద కునుకు లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నాడు చిరంజీవి. మ‌రి ఈ క‌ష్టానికి ఫ‌లితం ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories