English   

మెర్స‌ల్.. నిజంగానే అదిరింది..

Mersal-Teaser-Is-Out

మెర్స‌ల్.. అంటే పీక్స్ ఆఫ్ మాస్ అని అర్థం. ఇప్పుడు నిజంగానే ఈ చిత్రం త‌మిళ‌నాట పీక్స్ చూపిస్తుంది. విజ‌య్ కు ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో మెర్స‌ల్ టీజ‌ర్ మ‌ళ్లీ చూపించింది. ఈ చిత్ర టీజ‌ర్ కు వ‌స్తోన్న రెస్పాన్స్ చూసి బాలీవుడ్ సైతం బాబోయ్ అనుకుంటుంది. తొలిరోజే ఏకంగా 1 కోటి 30 ల‌క్ష‌ల వ్యూస్ అందుకుంది మెర్స‌ల్ టీజ‌ర్. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డ్ ఇది. ఇక ఒక్క‌రోజులో 7 ల‌క్ష‌ల 57 వేల లైకులు సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు విజ‌య్. ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సూప‌ర్ స్టార్ కు కూడా ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. ర‌జినీకాంత్ క‌బాలి.. అజిత్ వివేగం టీజ‌ర్స్ రికార్డుల్ని కేవ‌లం 9 గంట‌ల్లోనే తుడిచి పెట్టేసింది మెర్స‌ల్.

తెరీ త‌ర్వాత విజ‌య్ తో అట్లీకుమార్ తెర‌కెక్కిస్తోన్న సినిమా మెర్స‌ల్. తెరీ టైమ్ లో మేకింగ్ న‌చ్చి మ‌రోసారి అత‌డితో వ‌ర్క్ చేస్తున్నాడు విజ‌య్. మెర్స‌ల్ షూటింగ్ పూర్తైపోయింది. ప్ర‌స్తుతం హీరో విజ‌య్ విదేశాల్లో సేద తీరుతున్నాడు. ఇందులో స‌మంత‌, కాజ‌ల్, నిత్యామీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. విజ‌య్ తొలిసారి త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు మెర్స‌ల్ లో. ఊరుపెద్ద‌గా.. పొలిటీషియ‌న్ గా.. మెజీషియ‌న్ గా మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు విజ‌య్. ఈ సినిమాకు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందించ‌డం విశేషం. అంతేకాదు.. ఈ చిత్రం కోసం హై రేంజ్ టెక్నిక‌ల్ టీం వాడుకుంటున్నాడు అట్లీ. 100 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం విజ‌య్ కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిలవ‌నుంది. అక్టోబ‌ర్ 18న దీవాళి కానుక‌గా సినిమా విడుద‌ల కానుంది. తెలుగులో అదిరింది పేరుతో రానుంది మెర్స‌ల్.

More Related Stories