English   

అవార్డుల‌పై మ‌ళ్లీ మాట్లాడిన నాగార్జున‌..

Nagarjuna-Reacted-On-Nandi-Awards-Controversy

మొన్న విడుద‌లైన నంది అవార్డుల్లో ఎంత ర‌చ్చ జ‌రిగిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మామూలు ర‌చ్చ కాద‌ది.. ఇండ‌స్ట్రీలో ఇన్ని గ్రూపులు ఉన్నాయా అనేంత ఒక‌రిపై ఒక‌రు సెటైర్లు వేసుకున్నారు. అయితే ఎన్ని సినిమాలకు అవార్డులు వ‌చ్చినా రాక‌పోయినా మ‌నంకు మాత్రం రాలేద‌నే బాధ అంద‌రిలోనూ క‌నిపించింది. కావాల‌నే ఈ చిత్రాన్ని తొక్కేసార‌నే టాక్ కూడా ఉంది. అయితే వీటిపై ఇప్ప‌టి వ‌ర‌కు నాగార్జున స్పందించ‌లేదు. కానీ మొన్న‌ కొడుకు హ‌లో ట్రైల‌ర్ లో మాత్రం దానికి స‌మాధానం ఇచ్చాడు నాగార్జున‌.. ఇంకా చెప్పాలంటే సెటైర్ వేసాడు.

హ‌లో ట్రైల‌ర్ లో మ‌ధ్య‌లో వ‌చ్చే లైన్స్ లో మీ దీవెన‌లే  మాకు అవార్డులు.. మీ హృద‌యాల‌ను గెలుచుకోవ‌డ‌మే మాకు అవార్డుల‌తో స‌మానం అనే ప‌దం పెట్టాడు నాగ్. అంటే అవార్డులు వ‌చ్చినా రాక‌పోయినా మాకు పెద్ద‌గా తేడా ఏం లేద‌ని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు నాగార్జున‌. ఇక ఇప్పుడు హ‌లో సినిమా కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లోనూ ఇదే మాట రిపీట్ చేసాడు నాగార్జున‌. త‌న‌కు అవార్డుల కంటే ముఖ్య‌మైన ప్రేక్ష‌కుల గుండెలే సినిమాకు ఇచ్చారు. తండ్రి చివ‌రి సినిమాను ప్రేక్ష‌కులు మ‌న‌సుల్లో దాచేసుకున్నారు. అంత‌కంటే అవార్డులు త‌మ‌కేం ఎక్కువ కాద‌న్నాడు నాగార్జున‌. అక్క‌ర్లేద‌ని కూడా చెప్పాడు ఈ హీరో. మొత్తానికి మ‌నం అవార్డుల ర‌చ్చ‌ను నాగార్జున చాలా లైట్ తీసుకున్నాడు.

More Related Stories