English   

న‌మిత‌కు పెళ్లైపోతుంది బాబూ..!

Namitha-Is-All-Set-To-Get-Hitched

ద‌క్షిణాదిన గుడి క‌ట్టించుకునేంత అభిమానం ఉన్న తార‌లు చాలా త‌క్కువ. హీరోల‌కు గుడి క‌ట్ట‌డం వేరు కానీ హీరోయిన్ల‌కు కూడా గుడి క‌ట్టొచ్చ‌ని చూపించిన తొలి హీరోయిన్ ఖుష్బూ. ఈమెకు అక్క‌డ విప‌రీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ త‌ర్వాత న‌మిత అదే స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది. త‌న బొద్దందాల‌తో ఇండ‌స్ట్రీని ఊపేసింది న‌మిత‌. ఈమె త్వ‌ర‌లోనే పెళ్లి పీటలెక్కబోతుంది. తమిళ నటుడు వీరను ఆమె వివాహం చేసుకోనున్నారు. గత కొంతకాలంగా ఇద్ద‌రూ ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వీళ్ల ప్రేమకు అంగీకారం తెలిపాయి. దాంతో నవంబర్‌ 24న త‌మ వివాహం జ‌ర‌గ‌బోతున్న‌ట్లు న‌మిత అనౌన్స్ చేసింది. అభిమానుల ఆద‌ర‌ణ ఎప్ప‌టికీ ఇలాగే ఉండాల‌ని కోరుకుంది న‌మిత‌. తిరుపతిలో ఈ పెళ్లి ఘనంగా జరగబోతుంది.

2002లో సొంతం చిత్రంతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది న‌మిత‌. అప్పుడు ఆమె పేరు భైర‌వి. ఆ పేరుతోనే తెరంగేట్రం చేసింది నమిత. ఆ తర్వాత  త‌న పేరును న‌మిత‌గా  మార్చుకుంది. తెలుగులో ఒక రాజు ఒక రాణి.. జెమిని.. జగన్మోహిని.. బిల్లా.. సింహా లాంటి సినిమాలు చేసింది. ఇక త‌మిళ‌, హిందీ, మ‌ళ‌యాల సినిమాల్లోనూ న‌టించింది ఈ భామ‌. ఈ మ‌ధ్యే కమల్‌ హాసన్ యాంక‌ర్ గా ఉన్న బిగ్‌బాస్‌ షోలోనూ పాల్గొంది. ప్రస్తుతం నమిత ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ప్రేమిస్తే భరత్‌ ఇందులో హీరో. వాది ఉదయన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. ఈమె పెళ్లి త‌ర్వాత‌ కెరీర్ ఎలా డిజైన్ చేసుకోబోతుందో..?

More Related Stories