English   

నాన్న జ్ఞాప‌కాలంటూ ఏడుస్తున్న నాగ్..

Nanna-Edusthunna-Jnapakalantu-Nag

తండ్రి నాగేశ్వ‌ర‌రావ్ తో నాగార్జున‌కు ఎలాంటి అనుబంధం ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న మ‌ర‌ణించిన‌పుడు కూడా చిన్న‌పిల్లాడిలా ఏడ్చాడు ఈ హీరో. ఆయ‌న్ని ఓదార్చ‌డం ఎవ‌రి వ‌ల్ల కాలేదు. అయితే ఆయ‌న పోయినా కూడా అన్న‌పూర్ణ స్టూడియోస్ లో చాలా చోట్ల తండ్రిని చూసుకుని సంతోష‌ప‌డుతున్నాడు నాగార్జున‌. అయితే ఇప్పుడు ఆ ఆనందం కూడా ఆవిరైపోయింది. అన్న‌పూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 13 సాయంత్రం ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాదం జ‌రిగిన‌పుడు నాగార్జున కూడా అన్న‌పూర్ణ స్టూడియోలోనే ఉన్నారు. ఈ ప్ర‌మాదానికి కార‌ణం షార్ట్ స‌ర్క్యూట్ అంటున్నాడు నాగార్జున‌. అక్క‌డ కాలిపోయిన సెట్ మ‌హేశ్ బాబు భ‌ర‌త్ అనే నేను కోసం వేసింది అనుకున్నారంతా. కానీ అది కాదు.

అన్న‌పూర్ణ‌లో కాలిపోయింది మ‌నం సినిమా కోసం వేసిన సెట్. అవును.. సినిమా వ‌చ్చి మూడేళ్ళైనా కూడా ఇప్ప‌టికీ అక్కినేని చివ‌రి జ్ఞాప‌కంగా ఇప్ప‌టికీ ఆ సెట్ ను అలాగే కాపాడుకుంటూ వ‌చ్చాడు నాగార్జున‌. కానీ ఇప్పుడు అది కాలిపోయింది. మంట‌ల్లో ప‌డి క్ష‌ణాల్లో బూడిదైపోయింది. 2 కోట్ల వ‌ర‌కు ఆస్తిన‌ష్టం జ‌రిగింద‌ని చెప్పాడు నాగార్జున‌. అయితే ఆస్తి కంటే ముందు అందులో నాన్న‌గారి జ్ఞాప‌కాలు ఉన్నాయ‌ని బాధ‌పడ్డాడు నాగ్. ప్ర‌మాదం జ‌రిగిన కొన్ని క్ష‌ణాల్లోనే తాను అక్క‌డికి చేరుకున్నాన‌ని.. తెలంగాణ ప్ర‌భుత్వం త్వ‌ర‌గానే ఈ ఘ‌ట‌న‌పై స్పందించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపాడు నాగార్జున‌. ఎలాంటి ప్రాణన‌ష్టం జ‌ర‌గ‌లేదు. అయితే తాను ప్రేమ‌గా చూసుకుంటున్న తండ్రి జ్ఞాప‌కాలు కాలిపోవ‌డంతో అక్కినేని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నాగ‌చైత‌న్య‌-స‌మంత రిసెప్ష‌న్ జ‌రిగిన కొన్ని గంట‌ల‌కే ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డం వాళ్ల‌కు బాధ‌లో ముంచేసింది.

More Related Stories