English   

వాళ్ల‌కు రుణ‌ప‌డిపోయానంటున్న న‌య‌న్

nayanatara-fans

ఈ రోజుల్లో ఓ హీరోయిన్ 10 ఏళ్లు ఉండ‌ట‌మే క‌ష్టం. అలాంటిది న‌య‌న‌తార ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 14 ఏళ్లైపోయింది. ఇప్ప‌టికీ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ ఈ భామే. ఒక్కో సినిమాకు మూడు కోట్ల‌కు పైగా పారితోషికం తీసుకుంటూ అగ్ర‌పీఠంలో కొన‌సాగుతుంది న‌య‌న్. ఇక ఇప్పుడు ఈమె కొంద‌రికి థ్యాంక్స్ చెప్పే కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈమె కెరీర్ లో ఎన్నో లోటుపాట్లు చూసింది. త‌న కెరీర్ గురించి.. అందులో తాను ఎదుర్కొన్న‌ ఎత్తుపల్లాలు.. ఉన్న‌ మలుపులు.. తీసుకున్న‌ తీపి చేదు అనుభవాలు ఇలా అన్ని ఒక‌చోట వేసి అభిమానుల మ‌న‌సులు త‌డిసేలా ఓ లేఖ రాసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇది చూసి ఇప్పుడు అంతా న‌య‌న‌తారకు నిజంగానే ఫ్యాన్స్ అయిపోతున్నారు. 

న‌య‌న‌తార లేఖ ఇలా ఉంది.. నా జీవితాన్ని అర్ధవంతంగా మార్చిన మీకు ధన్యవాదాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ప్రేమతో ఆశీర్వదించబడ్డాను. మీ అభిమానమే నా జీవితాన్ని అందంగా మార్చింది. నా శక్తి కొలది నటిస్తున్నాను. మిగతాది భగవంతుడికే వదిలేస్తున్నాను. ఎంటర్‌టెయిన్‌మెంట్‌ చిత్రాలతో పాటు అరమ్‌ వంటి సందేశాత్మక చిత్రాలను అందించగలుగుతున్నానంటే మీ ఆదరణే కారణం. మీడియా వాళ్ల‌కు.. విమర్శకులకు నా కృతజ్ఞతలు. 2018వ సంవత్సరం ఇంకా మంచిగా ఉంటుంది. నాపై ఆదరాభిమానాలను చూపుతున్న అభిమానులకు మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.. అంటూ న‌య‌న తన స్వ‌హ‌స్తాల‌తో లేఖ రాసింది. అంద‌రిలా కాకుండా తన కెరీర్ కు ఉప‌యోగ‌ప‌డిన వాళ్లంద‌రికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపింది న‌య‌న‌తార‌.

More Related Stories