English   

సంక్రాంతి రేస్ ఇంక తెగ‌దా..?

New-Entries-In-Sankranthi-Race

చూస్తుంటే ఇంకా రెండు నెల‌లు కూడా స‌రిగ్గా లేదు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు పండ‌క్కి ఎవ‌రెవ‌రు వ‌స్తున్నారనే విష‌యంపై క్లారిటీ రాలేదు. కొన్ని రోజుల కింది వ‌ర‌కు అంతా క్లారిటీగానే ఉంది. కానీ మ‌హేశ్, చ‌ర‌ణ్ రేస్ నుంచి త‌ప్పుకునే స‌రికి మ‌ళ్లీ క‌న్ఫ్యూజ‌న్ మొద‌లైంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్-త్రివిక్ర‌మ్ సినిమా పండ‌క్కే రానుంది. జ‌న‌వ‌రి 10న ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ చిత్ర షూటింగ్ కూడా ప్ర‌స్తుతం బ‌ల్గేరియాలో జ‌రుగుతుంది. ఈ షెడ్యూల్ తోనే సినిమా షూటింగ్ చివ‌రిద‌శ‌కు రానుంది. హైద‌రాబాద్ లో చిన్న షెడ్యూల్  బాకీ ఉంటుందంతే. దాంతో ప‌వ‌న్ పండ‌క్కి రావ‌డం ప‌క్కా.

బాల‌య్య కూడా సంక్రాంతికే వ‌చ్చేస్తున్నాడు. ఈయ‌న కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న జై సింహా షూట్ ఇప్ప‌టికే చివ‌రికి వ‌చ్చేసింది. న‌వంబ‌ర్ లోనే షూటింగ్ పూర్తి కానుంది. ఇందులో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడు. న‌య‌న‌తార, న‌టాషా దోషి, హ‌రిప్రియ ఇందులో బాల‌య్య జోడీగా న‌టిస్తున్నారు. జ‌న‌వ‌రి 12న జై సింహా విడుద‌ల కానుంది. ఇక అనుష్క భాగ‌మ‌తి జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుంద‌ని తెలుస్తోంది. సంక్రాంతికి తొమ్మిదేళ్ల‌ కింద అరుంధ‌తిగా వ‌చ్చి అరాచ‌కం చేసింది అనుష్క‌. ఇక ర‌వితేజ ట‌చ్ చేసి చూడు కూడా సంక్రాంతికే రానుంది. విక్ర‌మ్ సిరి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇంతమంది ఉండ‌గానే రాజ్ త‌రుణ్ రాజుగాడు.. సూర్య డ‌బ్బింగ్ సినిమా.. విశాల్-స‌మంత న‌టించిన సినిమాలు కూడా సంక్రాంతికే రానున్నాయి. మ‌రి ఇన్ని సినిమాల్లో ఏది చివ‌రివ‌ర‌కు రేస్ లో నిల‌బ‌డుతుందో చూడాలి..!

More Related Stories