English   

మెగా వార‌మ్మాయికి చెప్పుకోలేని క‌ష్టాలు.. 

Niharika-Back-To-Web-Series

అవును.. ఇప్పుడు నిహారిక‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. బ్యాగ్రౌండ్ మాత్ర‌మే భారీగా ఉంటే స‌రిపోదు.. అదృష్టం కూడా అలాగే ఉండాలి. లేదంటే మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చినా మ‌రో ఫ్యామిలీ నుంచి వ‌చ్చినా తిప్ప‌లు త‌ప్ప‌వు. నిహారిక ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన తొలి హీరోయిన్ ఈమె. ఇప్ప‌టికే తొలి చిత్రం ఒక‌మ‌న‌సు డిజాస్ట‌ర్. ఒక మ‌న‌సు త‌ర్వాత నిహారిక పూర్తిగా క‌నిపించ‌డం మానేసింది. త‌మిళ ఇండ‌స్ట్రీకి వెళ్లిపోయి అక్క‌డ విజ‌య్ సేతుప‌తితో ఓ సినిమా చేస్తుంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. దాంతో ఈ మ‌ధ్యే తెలుగులో ఓ కొత్త‌ సినిమా మొద‌లుపెట్టింది మెగా డాట‌ర్. ఒక మ‌న‌సు ఫ్లాప్ త‌ర్వాత తెలుగులో అస‌లు సినిమాలు చేస్తుందా.. చేయ‌దా..? అనే ప్ర‌శ్న‌కు తెర‌దించుతు కొత్త ద‌ర్శ‌కుడితో హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో న‌టిస్తుంది నిహారిక‌. ఇందులో సుమంత్ అశ్విన్ హీరోగా న‌టించ‌నున్నాడు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌టం విశేషం.

హ్యాపీ వెడ్డింగ్ కంటే ముందే మెహ‌ర్ ర‌మేష్ శిష్యుడుతో ఓ సినిమా మొద‌లుపెట్టింది నిహారిక‌. కానీ ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌కుండానే అట‌కెక్కేసింది. ఈ చిత్ర నిర్మాత మొద‌ట్లోనే చేతులెత్తేసాడు. దాంతో నిహారిక సినిమా ఆగిపోయింది. దాంతో వ‌చ్చిన సినిమాలు చేస్తూ.. రాని అవ‌కాశాల కోసం వేచి చూడటం ఎందుక‌ని షార్ట్ ఫిల్మ్స్ పై మ‌న‌సు పెట్టింది ఈ కొణిదెల వార‌మ్మాయి. అస‌లు నిహారికకు సినిమాల కంటే ముందు గుర్తింపు తీసుకొచ్చింది షార్ట్ ఫిల్మ్స్. అమ్మాయిగారు అక్క‌డ్నుంచే ప్ర‌తిభ చూపించారు.

ఇప్ప‌టికే ముద్ద‌పప్పు ఆవ‌కాయ్ లాంటి స‌క్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ల‌లో న‌టించింది. ఇలాంటి టైమ్ లో సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు వెబ్ సిరీస్ చేస్తుంది నిహారిక‌. దానిపేరు నాన్న‌కూచి. ఇందులో నాగ‌బాబు కూడా న‌టిస్తుండ‌టంతో ఆస‌క్తి పెరిగిపోతుంది. పింక్ ఎలిఫెంట్ అంటే సొంత బ్యానర్ లోనే ఈ వెబ్ సిరీస్ ను నిర్మించింది నిహారిక‌. కొత్త ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మ‌ధ్యే విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటే క‌చ్చితంగా ఏదో కొత్త‌గానే అనిపిస్తుంది. ముద్ద‌పప్పు ఆవ‌కాయ్ తో సూప‌ర్ హిట్ కొట్టిన ఈ మెగా డాట‌ర్.. ఇప్పుడు తండ్రితో క‌లిసి ఏం చేయ‌బోతుందో..?

More Related Stories