English   

పులిపిల్ల బికినీ ట్రీట్.. 

Nikisha-Patel-s-New-Bikini-Avatar

ఒక్కోసారి అదృష్టం మ‌రీ ఎక్కువొచ్చినా త‌ట్టుకోలేం. నికిషా ప‌టేల్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. తొలి సినిమానే ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో న‌టించే అవ‌కాశం వ‌చ్చేస‌రికి.. నికిషా అదృష్టం ఏంటో అని అంతా కుళ్లుకున్నారు కూడా. కానీ ఏం చేస్తాం.. ఈ భామ న‌టించిన తొలి సినిమా పులి చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్ గా మారింది. దాంతో నికీషాను క‌నీసం ప‌ట్టించుకోలేదు ఈ ద‌ర్శ‌క నిర్మాత‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ అనే ముద్ర మిన‌హా ప‌వ‌ర్ స్టార్ నికీషా కెరీర్ కు ఏ ర‌కంగానూ హెల్ప్ కాలేదు. ఇప్ప‌టికీ ఈ భామ‌ను పులి హీరోయిన్ అనే అంటారు.

ఈ మ‌ధ్యే సాయిరాం శంక‌ర్ తో అర‌కురోడ్ లో అనే సినిమా చేసింది నికీషా. ఈ సినిమాలో ఏ మాత్రం సంకోచించ‌కుండా అందాలు ఆర‌బోసింది. కానీ ఏం లాభం.. సినిమా వ‌చ్చి వెళ్లిన‌ట్లు కూడా ఎవ‌రికీ తెలియ‌దు. దాంతో చేసేదేం లేక అందాల‌కు మెరుగులు దిద్దుకుంటుంది నికీషా ప‌టేల్. తాజాగా గుర్తు కూడా ప‌ట్ట‌నంత మేకోవ‌ర్ అయిపోయింది ఈ బ్యూటీ. బొద్దుగుమ్మ కాస్తా.. కాస్త బ‌రువు త‌గ్గింది. ఏకంగా బికినీ షో లో కూడా మెరిసింది. ఈ భామ కెరీర్ గాడిన ప‌డాలంటే పై నుంచి దేవుడు దిగివ‌చ్చి వ‌రాలు ఇవ్వాల్సిందే. అలా చేసినా కూడా పులి పిల్ల కెరీర్ ఒడ్డున ప‌డుతుందో లేదో తెలియ‌దు..! ప్ర‌స్తుతానికి వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను చేసుకుంటూ వెళ్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే బికినీ షో కూడా నిస్సందేహంగా చేస్తుంది నికీషా ప‌టేల్.

More Related Stories