English   

వెంక‌టేశ్ కు జోడీగా ఆ బ్యూటీ..

Nithya-Menon-To-Romance-Venky-in-Teja-s-Next

వెంక‌టేశ్ ఇప్పుడు తేజ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలోని పాత్ర కోస‌మే త‌న‌ను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. గ‌డ్డంతోనే ఇందులోనూ క‌నిపించ‌బోతున్నాడు వెంకీ. ఈ మ‌ధ్యే స‌మంత రిసెప్ష‌న్ లో కూడా పాత లుక్ లోనే క‌నిపించాడు వెంక‌టేశ్. డిసెంబ‌ర్ 13 నుంచి తేజ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఈ చిత్రంలో ప్రొఫెస‌ర్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు వెంక‌టేశ్. 25 ఏళ్ల త‌ర్వాత వెంకీ మ‌ళ్లీ లెక్చ‌ర‌ర్ గా న‌టిస్తున్నాడు. గ‌తంలో సుంద‌రాకాండ‌లో టీచర్ అవ‌తారం ఎత్తాడు వెంక‌టేశ్. అప్ప‌ట్నుంచి మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి పాత్ర చేయ‌లేదు వెంకీ.

ఇప్పుడు మ‌ళ్లీ తేజ కోసం పుస్త‌కం ప‌డుతున్నాడు. ఈ చిత్రంలో కాజ‌ల్ ను హీరోయిన్ గా తీసుకోవాల‌నుకున్నారు. కానీ ఆమె డేట్స్ కుద‌ర‌క పోవ‌డంతో ఇప్పుడు నిత్యామీన‌న్ వైపు అడుగేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. గ‌తంలోనే నిత్యాతో వెంకీ న‌టించాల్సి ఉంది. ఆడాళ్లూ మీకు జోహార్లు సినిమాలో వెంక‌టేశ్, నిత్యామీన‌న్ న‌టించాల్సి ఉంది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. మ‌ళ్లీ ఇప్పుడు ఆ కాంబినేష‌న్ సెట్ అవుతుంది. మొత్తానికి వెంక‌టేశ్ తో నిత్యామీన‌న్ కాంబినేష‌న్ అంటే కాస్త ఆస‌క్తిగానే ఉంది. చూడాలిక‌.. తేజ ఈ ఇద్ద‌రినీ ఎలా చూపించ‌బోతున్నాడో..?

More Related Stories