English   

హీరో కావాలంటున్న హ‌రీష్ శంక‌ర్..

No-Hero-Available-For-Harish-Shankar-s-Next

ద‌ర్శ‌కుల‌కు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో క‌ష్ట‌కాలం న‌డుస్తుంది. ఒక్కోసారి హిట్ కొట్టినా వెయిటింగ్ త‌ప్ప‌దు. ఖైదీ నెంబ‌ర్ 150 త‌ర్వాత వినాయ‌క్ సైతం ఆర్నెళ్ల పాటు వేచి చూసాడు. అలాంటిది యావ‌రేజ్ సినిమా ఇచ్చిన హ‌రీష్ శంక‌ర్ కూడా ఇప్పుడు వెయిటింగ్ లో ఉండ‌టం త‌ప్పేం కాదు. పైగా పాత క‌థ‌ల‌నే కొత్తగా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇలాంటి వాడి పారేసిన పాత క‌థ‌నే డిజేతో చెప్పాడు. ఈ చిత్రం జ‌స్ట్ ఓకే అనిపించింది. కానీ త‌న సినిమా హిట్ అని చెప్పేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇవ‌న్నీ ప‌క్క‌న బెడితే డిజే త‌ర్వాత ఇప్పుడు మ‌రో సినిమా ప‌నుల‌తో బిజీ అయ్యాడు హ‌రీష్ శంక‌ర్. దీనికి దాగుడు మూత‌లు అనే టైటిల్ కూడా అనుకుంటున్నాడు. క‌థ‌పై న‌మ్మ‌కంతో ఈ చిత్రాన్ని త‌నే నిర్మించ‌డానికి రెడీ అయ్యాడు హ‌రీష్ శంక‌ర్. దిల్ రాజు కూడా భాగ‌స్వామిగా ఉండే అవ‌కాశం ఉంది.

రామ‌య్యా వ‌స్తావ‌య్యా ఫ్లాప్.. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ హిట్.. డిజే యావ‌రేజ్.. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్నా కూడా త‌న బ్యాన‌ర్ లో హ‌రీష్ కు వ‌ర‌స‌గా నాలుగోసారి ఛాన్స్ ఇస్తున్నాడు దిల్ రాజు. ఆ మ‌ధ్య ఈ చిత్రం కోసం యుఎస్ లొకేష‌న్లు కూడా వెతికాడు హ‌రీష్ శంక‌ర్. దాగుడు మూతలు క‌థ దిల్ రాజు కు బాగా క‌నెక్ట్ కావ‌డంతో వెంట‌నే బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకొమ్మ‌ని చెప్పాడ‌ని తెలుస్తుంది. ముందుగా చెప్పిన‌ట్లుగానే ఇది ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తుంది. ఈ సినిమా కోసం నాని.. శ‌ర్వానంద్ ల‌ను అడ‌గాలని చూస్తున్నాడు హరీష్ శంక‌ర్. అయితే నాని రేంజ్ ఇప్పుడు మారిపోయింది. ఆయ‌న మ‌రో రెండేళ్ల వ‌ర‌కు బిజీ. ఇక శ‌ర్వా కూడా మారుతి సినిమాతో బిజీగా ఉన్నాడు. దాంతో దాగుడుమూత‌లు క‌థ నిజంగానే హ‌రీష్ తో దాగుడు మూత‌లు ఆడుకుంటుంది.

More Related Stories