English   

ఎన్టీఆర్ తో పోటీ ప‌డుతున్న మ‌హేశ్

NTR vs Mahesh

థియేట‌ర్స్ లోనే కాదు బుల్లితెర‌పై కూడా ఎన్టీఆర్, మ‌హేశ్ పోరు ఆగ‌డం లేదు. ఈ ఇద్ద‌రూ ఇప్పుడు మ‌రోసారి పోటీ ప‌డ‌బోతున్నారు. వీళ్ల సినిమాలు ఒకేసారి టీవీల్లో రాబోతున్నాయి. గ‌తేడాది ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం చూపించిన జై ల‌వ‌కుశ సంక్రాంతికి వ‌ర‌ల్డ్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ గా ప్ర‌సారం చేస్తున్నారు జెమిని టీవీ. ఇక ఇదే పండ‌క్కి మ‌హేశ్ స్పైడ‌ర్ కూడా రానుంది. జీ నెట్ వ‌ర్క్ ఈ చిత్రాన్ని కొనుక్కుంది. సంక్రాంతి కానుక‌గా మ‌హేశ్ న‌టించిన ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. థియేట‌ర్స్ లోనే డిజాస్ట‌ర్ గా నిలిచిన స్పైడ‌ర్ టీవీల్లో ఎంత‌వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో అనేది ఆస‌క్తికరంగా మారింది. అయితే జై ల‌వ‌కుశ‌పై మాత్రం అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం థియేట‌ర్స్ లో కూడా అద‌ర‌గొట్టింది. కాక‌పోతే ఎక్కువ రేట్ల‌కు సినిమాను అమ్మ‌డంతో కాస్త న‌ష్టాలు తెచ్చుకుంది. అబౌ యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిన ఈ చిత్రం టీవీల్లో కుమ్మేస్తుంద‌ని నమ్ముతున్నారు ఛానెల్ యాజ‌మాన్యం. జై ల‌వ‌కుశ‌లో మూడు పాత్ర‌ల్లోనూ కుమ్మేసాడు ఎన్టీఆర్. ముఖ్యంగా విల‌న్ జై గా ర‌ప్పాడించాడంతే. పండ‌క్కి ఈ ఇద్ద‌రి దెబ్బ‌కు రేటింగ్స్ కుదేల‌వ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. చూడాలిక‌.. మ‌హేశ్, ఎన్టీఆర్ పోటీలో విజ‌యం ఎవ‌ర్ని వ‌రిస్తుందో..? 

More Related Stories