English   

ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ మ‌ధ్య విభేధాలు.. 

NTR-Trivikram-Madhya-Vivedalu

అదేంటి.. ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేయ‌బోతున్నారు.. ఇలాంటి టైమ్ లో త్రివిక్ర‌మ్ తో ఎన్టీఆర్ కు విభేధాలేంటి అనుకుంటున్నారా..? అవును.. త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రూ సినిమా చేయ‌బోతున్నారు. కానీ త్రివిక్ర‌మ్ చెప్పిన క‌థ నిజంగానే ఎన్టీఆర్ కు న‌చ్చిందా.. లేదంటే మ‌రో క‌థ కావాల‌న్నాడా..? ఇప్పుడు ఇదే ఇండ‌స్ట్రీలో న‌డుస్తున్న హాట్ హాట్ చ‌ర్చ‌. అస‌లు విష‌యం ఏంటంటే.. ఎన్టీఆర్ కు త్రివిక్ర‌మ్ ఓ యాక్ష‌న్ స్టోరీ చెప్పాడ‌ని తెలుస్తోంది. ఈ క‌థ ఎన్టీఆర్ కు సూట్ అవుతుంద‌ని చెప్పింది ప‌వ‌న్ క‌ళ్యాణ్. త్రివిక్ర‌మ్ కూడా ప‌వ‌న్ చెప్పిన వెంట‌నే మ‌రో ఆలోచ‌న లేకుండా జూనియ‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లిపోయాడు. ఇది జూనియ‌ర్ కు కూడా బాగానే న‌చ్చింది. కానీ దీనికంటే మ‌రో క‌థపై ఎన్టీఆర్ మ‌న‌సు ప‌డ్డాడు. ఆ క‌థ త‌న‌తో చేయాల్సిందిగా త్రివిక్ర‌మ్ ను ఎన్టీఆర్ కోరాడ‌ని తెలుస్తోంది. కానీ దానికి మాట‌ల మాంత్రికుడు మాత్రం నో చెప్పాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

దీనికి కూడా ఓ కార‌ణం లేక‌పోలేదు. మ‌హేశ్ తో ఎన్నాళ్ల నుంచో ఓ సినిమా చేయాల‌ని చూస్తున్నాడు త్రివిక్ర‌మ్. కానీ టైమ్ క‌లిసి రావ‌డం లేదు. టాప్ హీరోలంద‌రికీ హిట్లిచ్చిన త్రివిక్ర‌మ్.. మ‌హేశ్ కు మాత్ర‌మే బాకీ ప‌డిపోయాడు. దాంతో ఎలాగైనా సూప‌ర్ స్టార్ కు ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇవ్వాల‌నేది త్రివిక్ర‌మ్ క‌ల‌. అందుకే ఆయ‌న కోస‌మే ప్ర‌త్యేకంగా ఓ క‌థ సిద్ధం చేసాడు మాట‌ల మాంత్రికుడు. అదే క‌థ‌ను ఎన్టీఆర్ కూడా విన్నాడు. కానీ ఎన్టీఆర్ కోసం అప్ప‌టికే మ‌రో క‌థ‌ను కూడా సిద్ధం చేసాడు త్రివిక్ర‌మ్. ఇప్పుడు త‌న కోసం ప్రిపేర్ చేసిన క‌థ కాకుండా.. మ‌హేశ్ కోసం రాసిన క‌థ‌ను త‌న‌తో చేయాలంటూ ఎన్టీఆర్ ప‌ట్టుప‌డుతున్నాడ‌ని తెలుస్తోంది. దీనిపై త్రివిక్ర‌మ్ మాత్రం స‌సేమిరా అంటున్నాడు.

ఈ విష‌యం ఇలా ఉంటే మ‌రో విష‌యంలోనూ ఎన్టీఆర్ తో త్రివిక్ర‌మ్ కు పెద్ద‌గా ప‌డ‌ట్లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే త‌న రెమ్యున‌రేష‌న్ ను కూడా ఈ సినిమా కోసం త‌గ్గించుకున్నాడు జూనియ‌ర్. ఇక ఈ చిత్రంలో ట‌బును కీల‌క‌పాత్ర కోసం తీసుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇది కూడా ఎన్టీఆర్ కు న‌చ్చ‌డం లేదంటున్నారు. అందుకే ఓ వైపు త్రివిక్ర‌మ్ సినిమా ఒప్పుకున్న త‌ర్వాత కూడా మ‌ళ్లీ దిల్ రాజు బ్యాన‌ర్ లో స‌తీష్ వేగేశ్న‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. శ్రీ‌నివాస క‌ళ్యాణంలో ఈయ‌న హీరోగా న‌టించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రి ఈ కోల్డ్ వార్ ఎప్ప‌టికి చల్లారుతుందో..?

More Related Stories