English   

సంక్రాంతికి చిన్నితెర‌పై సినిమా పండ‌గ‌.. 

ntr vs mahesh

 సంక్రాంతికి ఓ వైపు థియేట‌ర్స్ లో.. మ‌రోవైపు బుల్లితెర‌పై పండ‌గ న‌డుస్తుంది. అక్క‌డ ప‌వ‌న్, బాల‌య్య లాంటి హీరోలు థియేట‌ర్స్ లో సంద‌డి చేస్తుంటే.. ఇక్క‌డ ఎన్టీఆర్, మ‌హేశ్, ర‌వితేజ లాంటి వాళ్లొస్తున్నారు. థియేట‌ర్స్ లో పోరు ఆగ‌డం లేదు.. ఇప్పుడు బుల్లితెర‌పై కూడా ఆగ‌డం లేదు. ఈ పండ‌క్కి ప్ర‌తీ ఛానెల్ కొత్త సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఊరిస్తుంది. ముఖ్యంగా మ‌హేశ్, ఎన్టీఆర్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోరు న‌డుస్తుందిప్పుడు. ఈ ఇద్ద‌రూ ఇప్పుడు మ‌రోసారి పోటీ ప‌డ‌బోతున్నారు. వీళ్ల సినిమాలు ఒకేసారి టీవీల్లో రాబోతున్నాయి. 

గ‌తేడాది ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం చూపించిన జై ల‌వ‌కుశ సంక్రాంతికి వ‌ర‌ల్డ్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ గా ప్ర‌సారం చేస్తున్నారు జెమిని టీవీ. ఇక ఇదే పండ‌క్కి మ‌హేశ్ స్పైడ‌ర్ కూడా రానుంది. జీ నెట్ వ‌ర్క్ ఈ చిత్రాన్ని కొనుక్కుంది. సంక్రాంతి కానుక‌గా మ‌హేశ్ న‌టించిన ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. థియేట‌ర్స్ లోనే డిజాస్ట‌ర్ గా నిలిచిన స్పైడ‌ర్ టీవీల్లో ఎంత‌వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో అనేది ఆస‌క్తికరంగా మారింది. అయితే జై ల‌వ‌కుశ‌పై మాత్రం అంచ‌నాలు భారీగా ఉన్నాయి. 

ఈ చిత్రం థియేట‌ర్స్ లో కూడా అద‌ర‌గొట్టింది. కాక‌పోతే ఎక్కువ రేట్ల‌కు సినిమాను అమ్మ‌డంతో కాస్త న‌ష్టాలు తెచ్చుకుంది. అబౌ యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిన ఈ చిత్రం టీవీల్లో కుమ్మేస్తుంద‌ని నమ్ముతున్నారు ఛానెల్ యాజ‌మాన్యం. జై ల‌వ‌కుశ‌లో మూడు పాత్ర‌ల్లోనూ కుమ్మేసాడు ఎన్టీఆర్. ముఖ్యంగా విల‌న్ జై గా ర‌ప్పాడించాడంతే. పండ‌క్కి ఈ ఇద్ద‌రి దెబ్బ‌కు రేటింగ్స్ కుదేల‌వ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇక ఈ రెండు సినిమాల‌తో పాటు పండ‌క్కే ర‌వితేజ హోల్ స‌మ్ ఎంట‌ర్ టైన‌ర్ రాజా ది గ్రేట్.. శ‌ర్వానంద్ మ‌హానుభావుడు కూడా టీవీల్లో వ‌చ్చేస్తున్నాయి. చూడాలిక‌.. ఈ రేటింగ్స్ పోటీలో విజ‌యం ఎవ‌ర్ని వ‌రిస్తుందో..?

More Related Stories