English   

ఒక్క‌క్ష‌ణం.. శాటిలైట్ అదిరింది..

Okkakshanam-Satellite-Adirindhi

మెల్ల‌గా అల్లుశిరీష్ కూడా త‌న రేంజ్ పెంచుకుంటున్నాడు. ఒక‌ప్పుడు ఈయ‌న సినిమాలు వ‌స్తున్నాయంటే పెద్దగా ప‌ట్టించుకునే వాళ్లు కాదు. కానీ ఇప్పుడు త‌న క‌థ‌ల ఎంపిక‌తో ప‌ట్టించుకునేలా చేస్తున్నాడు ఈ అల్లు వార‌బ్బాయి. ప్ర‌స్తుతం ఈయ‌న ఒక్కక్ష‌ణం సినిమాతో వ‌స్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. డిసెంబ‌ర్ లోనే సినిమా విడుద‌ల కానుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది. విఐ ఆనంద్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో క‌చ్చితంగా ఏదో కొత్త‌ద‌నం ఉంటుంద‌నే అంచ‌నాలున్నాయి. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా త‌ర్వాత విఐ ఆనంద్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఒక్క‌క్ష‌ణంకు క‌లిసిరానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్ల మేర జరుగుతుంది. అస‌లు శిరీష్ సినిమాల‌కు ఈ రేంజ్ లో బిజినెస్ జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. ఇక ఇప్పుడు శాటిలైట్ కూడా ఊహ‌కంద‌ని రేంజ్ లో అమ్ముడైంది.

ఒక‌టి రెండు కాదు ఏకంగా 3.20 కోట్ల‌కు ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కొనేసింది జెమినీ ఛానెల్. శిరీష్ సినిమాల‌కు ఈ రేంజ్ రేట్ ప‌ల‌క‌డం ఇదే తొలిసారి. చాలా అంశాలు దీనికి హెల్ప్ అయ్యాయి. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా టీవీల్లోనూ సూప‌ర్ హిట్ కావ‌డం.. శిరీష్ న‌టించిన శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు, కొత్త‌జంట లాంటి సినిమాలు టీవీల్లో మంచి రేటింగ్స్ సాధించ‌డంతో ఒక్క‌క్ష‌ణంకు ఈ రేట్ ప‌లికింది.

More Related Stories