English   

పాడుతా తీయ‌గా అంటున్న రాశీ..

Padutha-Thiyaga-Antunna-Raasi

మ‌న హీరోయిన్ల‌లో క‌నిపించ‌ని టాలెంట్ లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పాట‌లు పాడ‌టంలో ఎవ‌రికి ఎవ‌రూ తీసిపోరు. ఇప్ప‌టికే శృతిహాస‌న్, నిత్యామీన‌న్ లాంటి వాళ్లు న‌ట‌న‌తో పాటు పాడ‌టంలోనూ స్టార్స్ అని నిరూపించుకున్నారు. ఇదే బాట‌లో ఇప్పుడు రాశీఖ‌న్నా కూడా న‌డుస్తుంది. ఈ భామ కూడా సింగ‌ర్ గా స‌త్తా చూపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం న‌ట‌న‌పై మాత్ర‌మే దృష్టిపెట్టిన ఈ భామ‌.. ఇక‌పై గాత్రంపై కూడా మ‌న‌సు మ‌ళ్లించ‌నుంది. బాత్రూమ్ సింగ‌ర్ గానే ఉన్న ఈమెను ప్రొఫెష‌న‌ల్ సింగ‌ర్ గా మార్చేస్తున్నారు మ‌న సంగీత ద‌ర్శ‌కులు. జోరు సినిమాలో టైటిల్ సాంగ్ పాడింది రాశీఖ‌న్నానే. ఈ మ‌ధ్యే మ‌ళ‌యాలంలోమోహ‌న్ లాల్ తో న‌టించిన విల‌న్ టైటిల్ సాంగ్ పాడింది రాశీఖ‌న్నా.

ఇన్నాళ్లూ కేవ‌లం త‌ను న‌టించిన సినిమాల్లో మాత్ర‌మే స‌ర‌దాగా పాడిన రాశీ.. ఇప్పుడు సింగింగ్ ను సీరియ‌స్ గా తీసుకుది. నారా రోహిత్ బాల‌కృష్ణుడులో రాశీఖ‌న్నాతో పాడించాడు సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ‌. ఇక స్టార్స్ ను పాడించే వ‌ర‌కు వ‌ద‌ల‌ని థ‌మ‌న్.. జ‌వాన్ లో రాశీ టాలెంట్ వాడుకున్నాడు.ఈమె పాడిన పాట ఆమెకంటే అందంగా ఉంటుందంటున్నాడు థ‌మ‌న్. మొత్తానికి న‌ట‌న‌తో పాటు సెకండ్ ఆప్ష‌న్ చూస‌కుంది రాశీఖ‌న్నా..!

More Related Stories