English   

ఇదేం పిచ్చి సామీ.. ట‌న్నుల కొద్దీ పేప‌ర్లు..!

Agnyathavaasi- premieres

త‌మ అభిమాన హీరో సినిమా విడుద‌లైతే గాల్లో పేప‌ర్లు జ‌ల్లి ఆనందాన్ని తెలుపుతుంటారు. మ‌హా అయితే ఎన్ని పేప‌ర్లు జ‌ల్లుతారు.. కేజీ, రెండు కేజీలు.. కానీ ట‌న్నులైతే చ‌ల్ల‌రు క‌దా..! కానీ ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ అది కూడా చేస్తున్నారు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ట‌న్నుల కొద్దీ పేప‌ర్లు త‌ర‌లిస్తున్నారు అభిమానులు. అజ్ఞాత‌వాసి థియేట‌ర్స్ లో అన్నీ పేపర్లు త‌ప్ప ఇంకేం క‌నిపించ‌కూడ‌ద‌ని ఫిక్సైపోయారు ఫ్యాన్స్. అందుకే ఒక‌టి రెండు కాదు.. 100 కేజీల పేప‌ర్ల‌ను తీసుకెళ్తున్నారు. వాళ్ల అభిమానం చూసి పోలీసులు కూడా షాక్ అవుతున్నారు. అభిమాన హీరోకు కటౌట్లు.. పాలాభిషేకాలు.. పేప‌ర్లు విస‌ర‌డాలు.. ఇలా ఎన్నెన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అంటే ర‌చ్చ ఎలా ఉంటుందో మ‌రోసారి చూపిస్తున్నారు ఫ్యాన్స్. వీళ్ళ ఆనందం చూసి ఇత‌ర హీరోల ఫ్యాన్స్ కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇండియా, ఓవ‌ర్సీస్ అనేది సంబంధం లేదు.. అన్నిచోట్లా ప‌వ‌న్ మేనియా క‌నిపిస్తుందిప్పుడు. ఇక ఇది గానీ హిట్టైతే మాట‌ల్లేవు.. రికార్డులే మాట్లాడ‌తాయి. 
 

More Related Stories