English   

ప‌వ‌న్-బోయ‌పాటి కాంబినేష‌న్..?

Pawan-Kalyan-And-Boyapati-Combination

అబ్బా.. ఊహించుకోడానికే అదిరిపోయింది క‌దా కాంబినేష‌న్. ఇక ఈ క‌ల‌యిక‌లో సినిమా వ‌స్తే ఎలా ఉంటుందో లెక్కేసుకోండి..? అస‌లే ప‌వ‌ర్ స్టార్ కు క్లాస్ మాస్ తో ప‌నిలేదు. బోయ‌పాటి అయితే ప‌క్కా మాస్. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ న‌టిస్తే వ‌చ్చే మాస్ ఔట్ పుట్ కు థియేట‌ర్స్ అన్నీ ద‌ద్ధ‌రిల్లిపోతాయి. మ‌రి నిజంగానే ఈ కాంబినేష‌న్ లో ఇప్పుడు సినిమా రాబోతుందా అంటే ఒక‌ప్పుడు అవున‌నే స‌మాధాన‌మే వ‌చ్చేది. వేదాళం సినిమా రీమేక్ కు ముందు బోయ‌పాటి శీనునే ద‌ర్శ‌కుడిగా అడిగారు. అజిత్ న‌టించిన ఈ చిత్రం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్. ఇందులో మాస్ అంశాలు పుష్క‌లంగా ఉండ‌టంతో బోయ‌పాటి అయితే బాగుంటాడ‌ని అనుకున్నారు నిర్మాత ఏఎం రత్నం. కానీ చివ‌రి నిమిషంలో అది క‌దుర‌లేదు. దాంతో నీస‌న్ ను తీసుకొచ్చారు. కానీ ఒక‌వేళ బోయ‌పాటి శీను గానీ ఈ సినిమాకు ఒప్పుకుని ఉంటేనా.. బాబోయ్ ర‌చ్చ ర‌చ్చే. ఏం చేస్తాం.. ఇప్పుడు కాక‌పోయినా త‌ర్వాతైనా బోయ‌పాటి-ప‌వ‌న్ కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ కావాల‌ని కోరుకుందాం..!

More Related Stories