English   

సంజ‌య్ సాహూ.. గౌత‌మ్ నందా.. అభిష‌క్త్

pawan-kalyan

ఒక్క‌సారి ఈ పేర్లు అన్నింటినీ గుర్తు చేసుకోండి. సినిమాలో హీరో పేరు నార్మ‌ల్ గా ఉంటే ఆ రోజు చూసి అప్పుడే మ‌రిచిపోతారు ప్రేక్ష‌కులు. కానీ త్రివిక్ర‌మ్ మాత్రం అలా కాదు. ఎందుకో తెలియ‌దు కానీ ఈయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా అన‌గానే ఎక్స్ ట్రా జోష్ లో క‌నిపిస్తుంటాడు. క‌థ నుంచి ప్ర‌తీ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడు. చివ‌రికి పేరు విష‌యంలోనూ అస్స‌లు కాంప్ర‌మైజ్ కాడు. ఆ పేరు ఎప్ప‌టికీ అలా గుర్తుండిపోవాలి. కావాలంటే చూడండి.. జ‌ల్సా వ‌చ్చి ప‌దేళ్లు అయిపోయింది. ఇప్ప‌టికీ అందులో ప‌వ‌న్ పేరు ఏంటంటే సంజ‌య్ సాహూ అని చెప్పేస్తుంటారు. కానీ ఇత‌ర సినిమాల్లో పేర్లు చెప్ప‌మంటే క‌ష్టం. ఇక అత్తారింటికి దారేదిలో గౌత‌మ్ నందా కూడా అంతే. దాన్ని ఏకంగా సినిమా టైటిల్ గా వాడేసాడు గోపీ చంద్. 

ఇక ఇప్పుడు అజ్ఞాత‌వాసిలోనూ ప‌వ‌న్ పేరు చాలా కొత్త‌గా ఉంది. ఇందులో అభిష‌క్త్ భార్గ‌వ‌గా క‌నిపించ‌బోతున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఈ పాత్ర కూడా కోట్ల‌కు వార‌సుడే. అభిష‌క్త్ భార్గ‌వ అనే పేరు చాలా కొత్త‌గా ఉంది. ఇక భార్గ‌వ అనే పేరు వ‌చ్చేలా భ‌గ‌భ‌గ‌మ‌నే అనే పాట‌లోనే మ‌న‌కు వినిపిస్తుంది. మొత్తానికి మ‌రోసారి ప‌వ‌న్ ను చాలా కొత్త‌గా చూపించ‌బోతున్నాడు మాట‌ల మాంత్రికుడు. అజ్ఞాత‌వాసి ట్రైల‌ర్ జ‌న‌వ‌రి 4 సాయంత్రం 6 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ స్టిల్స్ చూస్తుంటే సినిమాపై అంచ‌నాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా య‌జ్ఞంలో గోపీచంద్ మాదిరి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెట్టిన ఓ పోజ్ అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకుంటుందిప్పుడు.

More Related Stories