English   

అంతా అనుకున్న‌దే.. ప‌వ‌న్ ఇక బైబై.. 

Pawan-Kalyan-To-Qui-Films

ఊహించిన‌ట్లే జ‌రిగింది.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌కు ఇక గుడ్ బై చెప్పేసాడు. ఆయ‌న మ‌ళ్లీ సినిమాల్లో న‌టిస్తారో లేదో క్లారిటీ అయితే లేదు కానీ ప్ర‌స్తుతానికి అయితే ఆయ‌న నిర్ణయం తీసుకున్నాడు. వ‌దిలేయ‌డం అంటే పూర్తిగా వ‌దిలేస్తాడ‌ని అనుకోవ‌డం కాదు.. వీలున్న‌పుడు సినిమాలు కూడా చేస్తాడేమో కానీ ఇప్పుడు త‌న‌కు సినిమాలు చేయ‌డానికి స‌మ‌యం వీలుప‌డ‌ద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు ప‌వ‌ర్ స్టార్. అంతేకాదు.. జ‌న‌సేన ప‌నుల్లో బిజీ అయిపోతున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇప్ప‌టికే కార్యాలయం ఏర్పాటు కోసం స్థలాన్ని కూడా పరిశీలించారు. జ‌న‌సేన పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని లీజ్‌కు ఇచ్చిన కుటుంబాలను పవన్‌ సన్మానించారు. పార్టీ కార్యాలయాన్ని పర్యావరణహితంగా నిర్మిస్తామని ఆయన మాటిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నామని ప‌వ‌న్ వెల్లడించారు.

జనసేన పార్టీ కార్యాలయం విజ్ఞానకేంద్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. అభిమానులకు ఏదైనా జరిగితే తాను తట్టుకోలేనని పవన్ క‌ళ్యాణ్ స్పష్టం చేశాడు. గ‌త మూడు రోజులుగా ఏపీలో ఉన్నాడు ప‌వ‌న్. ఈ మ‌ధ్యే పోలవరం ప్రాజెక్ట్ ద‌గ్గ‌రికి వెళ్లి అక్క‌డి ప‌నులు అడిగి తెలుసుకున్నారు. పోలవరంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఆ త‌ర్వాత‌ రాజమండ్రిలో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ త‌ర్వాత ఫాతిమా కాలేజీ విద్యార్థులతో పవన్ కొన్ని మాట‌లు మాట్లాడారు.. అక్క‌డి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం తమని మోసం చేసిందని.. కోర్టును తప్పుదోవ పట్టించిందని విద్యార్థులు పవన్‌కు తెలిపారు. ఈ విష‌యంపై కూడా ప‌వ‌న్ సీరియ‌స్ గా మాట్లాడారు. విధ్యార్థుల‌కు అన్యాయం జ‌రిగితే తాను చూస్తూ ఊరుకోన‌న్నారు. మొత్తానికి ప‌వ‌న్ సినిమాలు వ‌దిలేస్తున్నాడ‌న్న‌మాట‌.

More Related Stories