English   

ప్రభాస్-అనుష్క.. పెళ్లి క‌హానీ.

Prabhas-marriage

ఈ రోజుల్లో సెలెబ్రెటీస్ పెళ్లి అంటే 30 త‌ర్వాతే. హీరోయిన్లు కూడా 30 దాటిన త‌ర్వాత కానీ పెళ్లి చేసుకోవ‌డం లేదు. ఈ లిస్ట్ లో మూడు ప‌దులు దాటేసి అనుష్క ఏడేళ్లైపోయింది. ఇక ప్ర‌భాస్ సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ ఇద్ద‌రూ 30 దాటి చాలా ఏళ్లైపోయింది. దాంతో సాధారణంగానే ఇద్ద‌రి పెళ్ళిపై ఎప్పుడూ కావాల్సిన‌న్ని రూమ‌ర్లు వ‌స్తూనే ఉంటాయి. ప్ర‌భాస్ వ‌య‌సు 38 ఏళ్లు.. అనుష్క వ‌య‌సు 36 ఏళ్లు.. ఇద్ద‌రూ పెళ్లికి దూరంగానే ఉన్నారు. మ‌గాళ్ళ ముచ్చ‌టేమో గానీ.. అమ్మాయి వ‌యసు 30 దాటితే ఇంకా పెళ్లి కాలేదా అంటారు. కానీ అనుష్క మాత్రం 36 వ‌చ్చినా.. అప్పుడే నాకు పెళ్ళేంటి అంటుంది. ఇక ప్ర‌భాస్ అయితే పెళ్ల‌నే ఒక మాట ఉంద‌నే విష‌య‌మే మ‌రిచిపోయాడు. ఇన్నాళ్లూ అంటే బాహుబ‌లి ఉంద‌ని చెప్పి త‌ప్పించుకున్నారు. కానీ ఇప్పుడు బాహుబ‌లి కూడా పూర్త‌యింది. కానీ ఇప్పుడు సాహో ఉందంటున్నాడు. 

ఇప్పుడు విదేశాల్లో సాహో కోసం శిక్ష‌ణ తీసుకుంటున్నాడు ప్ర‌భాస్. ఇక అనుష్క కుటుంబంతో క‌లిసి గ‌డుపుతుంది. పైగా ప్ర‌భాస్ ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునేలా క‌నిపించ‌డం లేదంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. మ‌రోవైపు కృష్ణంరాజు మాత్రం ప్ర‌భాస్ పెళ్లి ఈ ఏడాదే ఉంటుంద‌ని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇక అనుష్క సంగ‌తి మరోలా ఉంది. ఈ భామ త‌న పెళ్లి విష‌యం పూర్తిగా ఇంట్లో వాళ్ళ‌కు వ‌దిలేసింది. మ‌రో వైపు వ‌ర‌సగా సినిమాలు కూడా చేస్తూ పోతుంది జేజ‌మ్మ‌. ఇదిలా ఉంటే.. ఆ మ‌ధ్య ఇండ‌స్ట్రీలోని ఓ ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్ క‌మ్ నిర్మాత‌తో అనుష్క పెళ్లి అంటూ రూమ‌ర్లు వ‌చ్చాయి. మ‌రోవైపు త‌న‌కు పెళ్లి గురించి ఆలోచించే టైమ్ కూడా లేదంటుంది జేజ‌మ్మ‌. ప్ర‌స్తుతం భాగ‌మ‌తి సినిమాతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడేమో ప్ర‌భాస్, అనుష్క‌నే పెళ్లి చేసుకుంటున్నార‌నే వార్త‌లొస్తున్నాయి. మ‌రి ఈ రూమ‌ర్ల‌కు ఎప్పుడు చెక్ ప‌డుతుందో చూడాలిక‌..!

More Related Stories