English   

స్టెప్ బై స్టెప్.. ప‌వ‌న్ పూర్తి చేస్తున్నాడు..

PSPK-25-Audio-Launch-Date-Finalised

నిదాన‌మే ప్రధానం.. కాక‌పోతే అప్పుడ‌ప్పుడూ ఆల‌స్యం అమృతం విషం కూడా అంటారు. కానీ ప‌వ‌న్ కు ఇది మాత్ర‌మే తెలుసు. అందుకే ప్ర‌స్తుతం నిదానంగా త‌న సినిమా ప‌నులు పూర్తి చేస్తున్నాడు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టిస్తోన్న సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం యూర‌ప్ నుంచి బ‌ల్గేరియాకు షిఫ్ట్ అవుతుంది. అక్క‌డే కొన్ని రోజులుగా ప‌వ‌న్, అను ఎమ్మాన్యువ‌ల్, కీర్తిసురేష్ పై కీల‌క‌మైన స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట‌ను కూడా చిత్రీక‌రిస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు. ఈ చిత్ర షూటింగ్ న‌వంబ‌ర్ 29న ముగియ‌నుంది. ఇక డిసెంబ‌ర్ 14న ఈ చిత్ర ఆడియో విడుద‌ల కానుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఒక్క పాట సూప‌ర్ హిట్ అయింది. ఇప్పుడు అన్ని పాట‌ల‌కు ముహూర్తం ఫిక్స్ చేసాడు ప‌వ‌ర్ స్టార్.

టైటిల్ పై క‌న్ఫ‌ర్మేష‌న్ రాక‌పోయినా.. అజ్ఞాత‌వాసి అనే అంతా క‌న్ఫ‌ర్మ్ అయిపోయారు. చివ‌రి క్ష‌ణంలో త్రివిక్ర‌మ్ ట్విస్ట్ ఇవ్వ‌క‌పోతే త‌ప్ప ఇదే టైటిల్ ప‌క్కా చేసుకోవ‌చ్చు. యూర‌ప్ తో హైద‌రాబాద్ లో చిన్న షెడ్యూల్ మాత్ర‌మే బాకీ ఉంది. జ‌న‌వ‌రి 10న ప‌వ‌న్ సినిమా విడుద‌ల కానుంది. ఇది ప‌వ‌ర్ స్టార్ కు 25వ సినిమా కావ‌డం విశేషం. అందుకే ఎక్క‌డా కాంప్రమైజ్ కావ‌డం లేదు త్రివిక్ర‌మ్. అంతేకాదు.. ఆడియో రైట్స్ ను కూడా ఆదిత్య సంస్థ భారీ రేట్ కు కొనుగోలు చేసింది. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. వ‌ర‌స‌గా రెండు ఫ్లాపులు ఇచ్చిన ప‌వ‌న్.. మాట‌ల మాంత్రికుడితో క‌లిసి ఏం మాయ చేస్తాడో..?

More Related Stories