English   

కొడుకు కోసం ఆటో ఎక్కిన పూరీ..

Puri-Jagannadh-Stunts-For-Mehabooba

హీరో మారిన తీరు మార‌లేదు.. కొడుకు వ‌చ్చినా జోరు త‌గ్గ‌లేదు.. ఇప్పుడు పూరీ స్టైల్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. హీరో ఎవ‌రైనా త‌న స్పీడ్ మాత్రం త‌గ్గించుకోవ‌ట్లేదు ఈ ద‌ర్శ‌కుడు. కొడుకు సినిమా కదా.. కాస్త ఆలోచించి టైమ్ తీసుకుంటాడేమో అనుకుంటే.. ఊహూ లేదు త‌న‌కు ఎవ‌రైనా ఒక‌టే అంటున్నాడు. మెహ‌బూబా షూటింగ్ సూప‌ర్ ఫాస్ట్ గా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే హిమాచల్ ప్ర‌దేశ్, పంజాబ్ ల‌లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసాడు. అక్క‌డే నెల రోజుల‌కు పైగా భారీ షెడ్యూల్స్ పూర్తి చేసాడు పూరీ జ‌గ‌న్నాథ్. మ‌ధ్య‌ప్ర‌దేశ్, ల‌డ‌క్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంతో తాను మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని చూస్తున్నాడు పూరీ. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే మెహ‌బూబా షూటింగ్ జ‌రుగుతుంది. ఇక్క‌డే ఆటోల్లో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఛేజింగ్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు పూరీ. ఆకాశ్ పూరీ, నేహాశెట్టి ఇందులో జంట‌గా న‌టిస్తున్నారు. జ‌న‌వ‌రిలోపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్.

ఈ మ‌ధ్య మ‌రీ రొటీన్ సినిమాలు చేస్తున్నాడ‌ని పూరీపై విమ‌ర్శ ఒక‌టి వ‌చ్చింది. అందుకే కొడుకు కోసం కొత్త క‌థ‌ను ప‌ట్టుకొస్తున్నాడు పూరీ. ఈ చిత్రం 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో సాగుతుంది. అంటే 40 ఏళ్ల కింది క‌థ అంటే మొత్తం సాగుతుందనుకుంటే పొరపాటే. దీనికి పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యం టచ్ ఇస్తున్నాడు పూరీ. హీరోతో పాటు హీరోయిన్ కూడా ఇండో పాక్ వార్ లో క‌న్నుమూసి.. ఇప్పుడు మ‌ళ్లీ జ‌న్మెత్తుతార‌ని తెలుస్తోంది. సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పాక్ అమ్మాయిగా నేహాశెట్టి న‌టిస్తోంది. ఇండియ‌న్ అబ్బాయి.. పాక్  అమ్మాయి మ‌ధ్య ప్రేమ క‌థ అనేదే పెద్ద క‌మ‌ర్షియ‌ల్ పాయింట్.. అందులోనూ 1971 వార్ అనేది ఇంకా ఆస‌క్తిక‌రంగా ఉంది. ఈ రెండింటి మ‌ధ్య‌లో పూరీ ప్రేమ‌క‌థ ఎలా ఉండ‌బోతుందో..? వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రీలో విడుద‌లకు ప్లాన్ చేస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్.

More Related Stories