English   

మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన రాజ‌శేఖ‌ర్..

Rajasekhar-Bumper-Offer-To-Tollywood-Directors

రాజ‌శేఖ‌ర్ అనే ఓ హీరో ఉన్నాడ‌నే విష‌యాన్ని మ‌ళ్లీ ఈ మ‌ధ్యే గ‌రుడ‌వేగ సినిమా గుర్తు చేసింది. ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ కాలేదు కానీ ప్ర‌శంస‌ల‌తో పాటు రాజ‌శేఖ‌ర్ ఈజ్ బ్యాక్ అనే ముద్ర కూడా తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంలో కెరీర్ ను జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ హీరో. ముఖ్యంగా నెక్ట్స్ సినిమాల‌పై కీల‌క‌మైన విష‌యాలు చెప్పాడు రాజ‌శేఖ‌ర్. ఎక్క‌డ మొద‌లుపెట్టావో అక్క‌డికి వ‌చ్చి ఆగుతున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. కొన్నేళ్లుగా స‌రైన ఫామ్ లేక ఇబ్బంది ప‌డుతున్న ఈ హీరో ఇప్పుడు విల‌న్ గా మార‌డానికి సై అనేసాడు. త‌న‌కి న‌చ్చే క‌థ రావాలే కానీ ఇప్పుడే విల‌న్ గా న‌టిస్తానంటూ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు రాజ‌శేఖ‌ర్.

ఇప్ప‌టికే రాజ‌శేఖ‌ర్ జ‌మానాలోని వినోద్ కుమార్, సుమ‌న్, రాజేంద్ర ప్ర‌సాద్, జ‌గ‌ప‌తిబాబు లాంటి హీరోలు కారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. కానీ రాజ‌శేఖ‌ర్ మాత్రం తానింకా హీరోనే అనే ఫీలింగ్ లోనే ఇన్నాళ్లూ బ‌తికేసాడు. ఇక ఇప్పుడు గ‌రుడ‌వేగ‌కు అంత మంచి టాక్ వ‌చ్చినా కూడా క‌లెక్ష‌న్లు రాక‌పోయేస‌రికి త‌న మార్కెట్ రేంజ్ ఏంటో అర్థం చేసుకున్నాడు ఈ హీరో. ఇక కెరీర్ లో చెప్పుకోడానికి ఏం లేదని ఆయ‌న‌కు కూడా సీన్ అర్థ‌మైపోయింది. అందుకే విల‌న్ గా న‌టించ‌డానికి ఓకే చెప్పాడు రాజ‌శేఖ‌ర్. 
కెరీర్ మొద‌ట్లో త‌లంబ్రాలు లాంటి సినిమాల్లో రాజశేఖ‌ర్ నెగిటివ్ రోల్స్ చేసాడు. ఆ త‌ర్వాత హీరోగా మారాడు. మ‌ళ్లీ ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ ప్ర‌తినాయ‌క పాత్ర‌ల‌పై మోజు ప‌డుతున్నాడు.

ఆ మ‌ధ్య చిరంజీవి 150వ సినిమాలో విల‌న్ గా న‌టిస్తాన‌ని చెప్పిన రాజ‌శేఖ‌ర్.. ఆ త‌ర్వాత ధృవ‌లో న‌టించ‌డానికి ట్రై చేసాడు. కానీ అనుకోని కార‌ణాల‌తో అర‌వింద్ స్వామినే రిపీట్ చేయాల్సి వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఈయ‌న విల‌న్ అవ‌తారం ఎత్త‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. రాజ‌శేఖ‌ర్ ను విల‌న్ గా చూపించ‌బోయే ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో..?

More Related Stories