English   

2.0 ఎవ‌ర‌డిగారు.. ఎందుకాపారు..? 

Rajinikanth-2.0

అడ‌క్క‌ముందే ఇచ్చే ఆనందం ఎలా ఉంటుందో చూడాలనుకున్నారు 2.0 యూనిట్. అందుకే ఈ సారి ఎవ‌రూ అడ‌క్క‌పోయినా ముందే టీజ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. అది కూడా జ‌న‌వ‌రి 6నే.. దాంతో అభిమానులు ఆనందంలో తేలిపోయారు. కానీ ఇప్పుడు సీన్ చూస్తే సారీ అనేసారు. ఇంత‌కీ అడ‌క్క‌ముందే టీజ‌ర్ రిలీజ్ డేట్ చెప్ప‌డం ఎందుకు.. త‌ర్వాత మార్చ‌డం ఎందుకు అంటున్నారు అభిమానులు. కొన్ని సాంకేతిక కార‌ణాల‌తో ఈ టీజ‌ర్ ఇప్పుడు రావ‌డం లేద‌ని తేల్చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌ళ్లీ అదెప్పుడో కూడా చెప్ప‌లేదు. సినిమా విడుద‌ల విష‌యంలోనూ ఇదే చేసి చేసి చివ‌రికి జ‌న‌వ‌రిలో రావాల్సిన సినిమాను కాస్తా ఎప్రిల్ 14కి పంపించేసారు. టీజ‌ర్ విష‌యంలోనూ ఇదే చేస్తున్నారు. టెక్నిక‌ల్ కార‌ణాల‌తో జ‌న‌వ‌రి 6న ఈ టీజ‌ర్ విడుద‌ల కావ‌ట్లేదు.. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ డేట్ చెబుతాం అంటూ మ‌రో అనౌన్స్ మెంట్ ఇచ్చారు లైకా ప్రొడ‌క్ష‌న్స్. అన్నీ కుదిర్తే జ‌న‌వ‌రి 26న 2.0 టీజ‌ర్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. చూడాలిక‌.. అప్పుడైనా వ‌స్తుందో.. లేదంటే మ‌ళ్లీ ఇలాగే ఏదో ఓ కార‌ణం చెబుతారో..? 

More Related Stories