English   

ర‌జినీకాంత్ జ‌న్మ‌లో ముఖ్య‌మంత్రి కాలేడా..? 

rajinikanth-newparty

ఇప్పుడు త‌మిళ‌నాట ఉన్న‌ది ఒక‌టే చ‌ర్చ‌.. ర‌జినీకాంత్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏంటి..? ఎలా ఉండ‌బోతుంది..? ఆయ‌న పార్టీ పెట్టినా ముఖ్య‌మంత్రి అవుతాడా కాడా..? అస‌లు రాజ‌కీయాల్లో ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడు.. అనేది ఇప్పుడు అంద‌ర్లోనూ ఉన్న ఆస‌క్తి. దీనిపై త‌మిళ‌నాట భిన్న‌మైన కోణాలు క‌నిపిస్తున్నాయి. వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అభిమానుల‌ను అడిగితే ఆయ‌నే మా ముఖ్య‌మంత్రి అంటున్నారు. అందులో ఎలాంటి డౌట్స్ లేవు.. జ‌య‌ల‌లిత త‌ర్వాత ఆ ఛ‌రిష్మా ర‌జినీకే ఉందంటున్నారు వాళ్లు. అమ్మ లేని లోటును అన్నే తీరుస్తాడంటున్నారు. కానీ కర్ఱాటకలోని ప్రకాశ్ అమ్మునాయ్ అనే అస్ట్రాలజర్ రజినీకాంత్ రాజ‌కీయాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. సూప‌ర్ స్టార్ ది మకర రాశి.. సింహ లగ్నం కావటం వల్ల ర‌జినీ కాంత్ ను ఓడించటం ఎవరి తరమూ కాదని చెప్పారు. అయితే అదే సమయంలో తమిళనాడుకు ముఖ్య‌మంత్రి అయ్యే యోగం మాత్రం ర‌జినీకాంత్ కు  లేద‌ని తేల్చేసాడాయ‌న‌. దానికి గ్ర‌హాలు స‌హ‌క‌రించ‌ట్లేదంటున్నాడు ప్ర‌కాశ్ అమ్మునాయ్. 

త‌న పార్టీలోనే ఇంకొక‌ర్ని ముఖ్య‌మంత్రి సీట్లో కూర్బోబెట్టి.. తాను ఛీఫ్ గా ఉండ‌టం బెట‌ర్ అని సూచిస్తున్నాడు ఈ ఆస్ట్రాల‌జ‌ర్. ఈయ‌న చెప్పిన దాంట్లో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు గానీ.. పార్టీ పెట్టి గెలిపించి.. త‌ను కాకుండా మ‌రొక‌ర్ని ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెడ‌తానంటే అభిమానులు ఊరుకుంటారా.. అస‌లు దీనికి ఒప్పుకుంటారా..?  అదీగాక రెండు దశాబ్దాల ఉత్కంఠ త‌ర్వాత రాజకీయ ప్రవేశం చేస్తున్న తలైవా సీఎం అవ్వకుండా తెర వెనుక చక్రం తిప్పటానికి సిద్ధపడతాడా..? ఈ ఆస్ట్రాల‌జ‌ర్ మ‌రో మాట కూడా చెప్పాడు. ర‌జినీకాంత్ కు ద‌గ్గ‌రి వాళ్ల నుంచే ముప్పు ఉంటుంద‌ని చెప్పాడు. వెన్నుపోటు పొడిచే వాళ్లు ర‌జినీ పంచ‌న చేరుతార‌ని చెబుతున్నాడాయ‌న‌. ఇదంతా చూస్తుంటే జ‌య‌ల‌లిత‌, శ‌శిక‌ళ ఎపిసోడ్ గుర్తుకు రాక మాన‌దు. మ‌రి చూడాలిక‌.. ర‌జినీ రాజ‌కీయాల‌కు అత‌డి జాత‌కానికి జ‌రుగుతున్న పోరాటంలో విజ‌యం ఎవ‌రిదో..?

More Related Stories