English   

పూరీ హీరోయిన్ కు ర‌కుల్ రిఫెరెన్స్.. 

Rakul-Preet-Singh-Special-Recommendation-To-Puri

హీరో ఎవ‌రైనా తీరు మార్చుకోని ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్. ఈయ‌న ఓ సినిమా మొద‌లుపెట్టాడంటే దూకుడే దూకుడు. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న కొడుకు సినిమా మెహ‌బూబాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం పంజాబ్ లో జ‌రుగుతుంది. ఈ మ‌ధ్యే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసాడు పూరీ. ఇప్పుడు పంజాబ్ వెళ్లాడు. అక్క‌డ్నుంచి మ‌ధ్య ప్ర‌దేశ్, ల‌డ‌క్ ఇంకా చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో నేహా శెట్టి అనే కొత్త‌మ్మాయి న‌టిస్తుంది. సినిమాకో కొత్త భామ‌ను ప‌ట్టుకురావ‌డం పూరీకి కామ‌న్. అయితే ఈ సారి హీరోయిన్ వెన‌క మాత్రం చిన్న క‌థ ఉంది. నేహా సీన్ లోకి రావ‌డానికి కార‌ణం ర‌కుల్ ప్రీత్ సింగ్ అని తెలుస్తోంది.

ఇక్క‌డే చిన్న ట్విస్ట్ కూడా ఉంది. నేహా శెట్టి బాయ్ ఫ్రెండ్ అమన్. ఇంత‌కీ ఈ అమ‌న్ ఎవ‌రో తెలుసా.. ర‌కుల్ ప్రీత్ కు స్వ‌యానా త‌మ్ముడు. నేహా, అమన్ చాలా క్లోజ్ గా ఉంటారు. అందుకే పూరీ ని రికమెండ్ చెయ్యమని అమన్ నుంచి ర‌కుల్ ను నేహ కోరడం.. వెంటనే రకుల్ ఆమెని ఆడిషన్ కి రమ్మని అడగడం.. అక్క చెవిలో అమన్ ఓ మాట వేయడం.. ఆ త‌ర్వాత పూరీ సీన్ లోకి రావ‌డం.. అన్నీ చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి. పైగా ఈ భామ కూడా చూడ్డానికి బాగుంటుంది. దాంతో ఆకాశ్ కు అమ‌న్ గాళ్ ఫ్రెండ్ ను అలా సెట్ చేసాడు పూరీ జ‌గ‌న్నాథ్. మొత్తానికి త‌మ్ముడి కోసం పెద్ద ప‌నే చేసింది ర‌కుల్.

More Related Stories