English   

సాయిప‌ల్ల‌వికి షాకిచ్చిన ర‌కుల్.. 

rakul-saipallavi

ఇప్పుడు సాయిప‌ల్ల‌వి అనేది బ్రాండ్ అని తెలుసు. కానీ ఈమె ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోల‌తో న‌టించ‌లేదు.. పైగా గ్లామ‌ర్ షో కూడా చేయ‌దు. దాంతో స్టార్ హీరోయిన్ల‌తో పోలిస్తే ఇప్ప‌టికీ సాయిప‌ల్ల‌వి కాస్త త‌క్కువే. అయితే చిన్న హీరోల‌కు మాత్రం సాయిప‌ల్ల‌వి ఓ బ్రాండ్. కానీ ఇప్పుడిప్పుడే స్టార్స్ తో న‌టించ‌డానికి ఒప్పుకుంటుంది సాయిప‌ల్ల‌వి. సూర్య సినిమాకు ఓకే చెప్పి ఈ దిశ‌గా తొలి అడుగు వేసింది. సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈమె న‌టించ‌బోతుంది. ఇందులో సాయిప‌ల్ల‌వితో పాటు ర‌కుల్ కూడా మ‌రో హీరోయిన్ గా న‌టించ‌నుంది. ఇందులో ముందు ర‌కుల్ నే అనుకున్నారు.. ఆ త‌ర్వాత సాయిప‌ల్ల‌వి వ‌చ్చింది.. దాంతో ర‌కుల్ వెళ్లిపోయింద‌నుకున్నారు కానీ ఇందులో ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఛాన్స్ ఉంద‌ని త‌ర్వాతే తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌రో షాకింగ్ న్యూస్ బ‌య‌టికి వ‌చ్చింది. 

ర‌కుల్ ఇందులో మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. సాయిప‌ల్ల‌వి మాత్రం ప్లాష్ బ్యాక్ కు ప‌రిమితం కానుంది. ఇదే ఇప్పుడు ఈమెకు షాక్ ఇచ్చింద‌ని తెలుస్తుంది. త‌న‌కు మెయిన్ రోల్ అని చెప్పారు కానీ ఇలా చిన్న రోల్ అని చెప్ప‌లేద‌ని స‌న్నిహితుల‌తో చెబుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ప‌ల్ల‌వికి సూర్య ఫేవ‌రెట్ హీరో.. అత‌డితో న‌టించే అవ‌కాశం వ‌దులుకోవ‌డం ఈ భామ‌కు ఇష్టం లేదు. అందుకే కాంప్ర‌మైజ్ అయిపోతుంద‌ని తెలుస్తుంది. అంతేకాదు.. పారితోషికం విష‌యంలోనూ సాయిప‌ల్ల‌వి కంటే ర‌కుల్ కే ఎక్కువ ఇస్తున్నార‌ని తెలుస్తుంది. మొత్తానికి సూర్య సినిమా విష‌యంలో ప‌ల్ల‌వికి షాక్ ల మీద షాకులు త‌గులుతున్నాయి.

More Related Stories