English   

అచ్చిరాని సెంటిమెంట్ వైపు ర‌వితేజ

Ravi-Teja-to-Act-In-Bhogan-Telugu-Version

ఏడాదిన్న‌రకు పైగా గ్యాప్ తీసుకుని సినిమాల‌కు పూర్తిగా దూర‌మైపోయాడు ర‌వితేజ‌. ఈ గ్యాప్ లో నాని, శ‌ర్వానంద్ లాంటి హీరోలంతా స్టార్స్ అయిపోయారు. దాంతో మ‌ళ్లీ రేస్ మొద‌లుపెట్టాడు మాస్ రాజా. అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తోన్న రాజా ది గ్రేట్ షూటింగ్ చివ‌రిద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రం అక్టోబ‌ర్ 12న విడుద‌ల కానుంది. ఇక విక్ర‌మ్ సిరితో చేస్తోన్న ట‌చ్ చేసి చూడు కూడా స‌గానికి పైగా షూటింగ్ అయిపోయింది. అయితే స్క్రిప్ట్ లో చిన్న మార్పులు చేయాల్సి రావ‌డంతో ప్ర‌స్తుతానికి ఆ చిత్ర షూటింగ్ కు కాస్త బ్రేక్ ప‌డింది. ఈ రెండు సినిమాల త‌ర్వాత మ‌రో రెండు సినిమాలు లైన్ లోకి వ‌చ్చేసాయి.

త‌మిళ్ లో హిట్టైన భోగ‌న్ రీమేక్ లో ర‌వితేజ న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి కుర్ర ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాధినేని మాట‌లు, స్క్రీన్ ప్లే రాస్తుండ‌టం విశేషం. ఒరిజిన‌ల్ నే తెర‌కెక్కించిన ల‌క్ష‌ణ‌న్ ఈ చిత్రాన్ని తెలుగులోనూ రూపొందించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ర‌వితేజ‌తో పాటు ఈ చిత్రంలో మ‌రో హీరో కూడా న‌టించ‌బోతున్నాడు. అది ఎవ‌ర‌నే విష‌యంపై ఇంకా క్లారిటీ రాలేదు. జ‌యంర‌వి పాత్ర‌లో ర‌వితేజ‌.. అర‌వింద్ స్వామి పాత్ర‌లో మ‌రో హీరోను తీసుకోబోతున్నారు. మొత్తానికి చూడాలిక‌.. రీమేక్ సినిమాలు ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజ‌కు పెద్ద‌గా కలిసిరాలేదు. ఒక్క ఇడియ‌ట్ త‌ప్ప‌.. మ‌రిప్పుడు భోగ‌న్ ప‌రిస్థితి ఏంటో..?

More Related Stories