English   

ట‌చ్ చేసి చూడు.. మాస్ రాజ్ బ్యాక్

raviteja-touchchesichudu

టీజర్ వ‌స్తుంది వ‌స్తుంది అంటే ఏదో డైలాగ్ ఇస్తారేమో అనుకున్నారు కానీ అలా స్టైల్ గా న‌డుచుకుంటూ వ‌చ్చేదాంతోనే ట‌చ్చింగులు ఆపేప‌సాడు ర‌వితేజ‌. అయితే మ‌రోసారి ఈ టీజ‌ర్ లోనే మాస్ ప‌వ‌ర్ చూపించాడు మాస్ రాజా. పోలీస్ ప‌వ‌ర్ చూపిస్తూనే విలన్ల‌కు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. త‌న‌ను ట‌చ్ చేస్తే రిజ‌ల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ టీజ‌ర్ తోనే అర్థ‌మ‌య్యేలా చూపించాడు ర‌వితేజ. ఈ చిత్రం కోసం సూప‌ర్ స్టైలిష్ గా మారిపోయాడు మాస్ మ‌హారాజ్. ఈ చిత్రం కోసం క‌రెంట్ తీగలా మారిపోయాడు ర‌వితేజ‌. అస‌లు ఇందులో ర‌వితేజ‌ను చూస్తుంటే నిజంగానే మ‌నం చూస్తున్న‌ది మాస్ రాజానేనా అనే అనుమానం వ‌స్తుంది. ఒక‌ప్పుడు కాస్త బొద్దుగా క‌నిపించిన ర‌వితేజ‌.. ఇప్పుడు స‌న్న‌గా మారిపోయాడు. 

కొత్త ద‌ర్శ‌కుడైనా ఈ విష‌యాన్ని ఇట్టే ప‌ట్టాడు విక్ర‌మ్ సిరి. ట‌చ్ చేసి చూడులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు ర‌వితేజ‌. ఈయ‌న వాలకం చూస్తుంటే సినిమాలో నిజంగానే ఎవ‌రైనా ట‌చ్ చేస్తే వాళ్ల అంతు చూసే వ‌ర‌కు వ‌దిలేలా లేడు. ఇప్పుడు ట‌చ్ చేసి చూడు టీజ‌ర్ విడుద‌లైంది. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లు. జ‌న‌వరిలో షూటింగ్ పూర్తి చేసి.. ఫిబ్ర‌వ‌రి 2న సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రానికి వ‌క్కంతం వంశీ  క‌థ అందిస్తున్నాడు. మొత్తానికి ఈ టీజ‌ర్ చూసిన త‌ర్వాత సినిమాపై అంచ‌నాలు మాత్రం మ‌రింత పెర‌గ‌డం ఖాయం. చూడాలిక‌.. ర‌వితేజ‌ను ట‌చ్ చేస్తే ఏమ‌వుతుందో..?

More Related Stories