English   

దుల్క‌ర్ స‌ల్మాన్ కు జోడీగా రితూవ‌ర్మ‌..

Ritu-Varma-To-Romance-Dulquer-Salmaan

తెలుగ‌మ్మాయిలు హీరోయిన్లుగా రారు.. వ‌చ్చినా నిల‌బ‌డ‌రు.. ఇలాంటి క‌మెంట్స్ తెలుగు ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తుంటాయి. కానీ అంజ‌లి.. స్వాతి లాంటి ముద్దుగుమ్మ‌ల నుంచి నిన్న‌మొన్న‌టి రితూవ‌ర్మ వ‌ర‌కు అంతా తెలుగ‌మ్మాయిలే. కానీ వీళ్ల‌కు తెలుగులో మాత్రం ఎవ‌రూ అవ‌కాశాలు ఇవ్వ‌రు. కావాలంటే చూడండి.. రితూ హీరోయిన్ గా న‌టించిన పెళ్లిచూపులు.. కేశ‌వ సినిమాలు విజ‌యం సాధించాయి. అయినా ఆమెకు తెలుగులో అవ‌కాశాలు లేవు. కానీ మ‌న హీరోయిన్ ను పిలిచి మ‌రి త‌మిళ‌నాట అవ‌కాశాలిస్తున్నారు.

ఈ మ‌ధ్యే ధ‌నుష్ విఐపి 2లో కీల‌క‌పాత్ర‌లో న‌టించింది రితూ. ఇక విక్ర‌మ్ ధృవ‌న‌క్ష‌త్రంలోనూ హీరోయిన్ గా న‌టిస్తుంది. గౌత‌మ్ మీన‌న్ ధృవ‌న‌క్ష‌త్రంలో ముందు అను ఎమ్మాన్యువ‌ల్ ను హీరోయిన్ గా అనుకున్నా.. త‌న స్థానంలోకి రితూ వ‌చ్చింది. ఇక ఇప్పుడు మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీలోకి కూడా అడుగు పెడుతుంది. అక్క‌డ దుల్క‌ర్ స‌ల్మాన్ తో ఓ సినిమాకు సైన్ చేసింది రితూవ‌ర్మ‌. దేసింగ్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. పైగా రితూవ‌ర్మ‌కు గ్లామ‌ర్ షోలో కూడా ఈమె పెద్ద‌గా అడ్డంకులు చెప్ప‌దు. మ‌రి చూడాలిక‌.. ఈ తెలుగ‌మ్మాయి మిగిలిన ఇండ‌స్ట్రీల‌ను ఎలా చుట్టు ముట్టేయ‌నుందో..?

More Related Stories