English   

దుబాయ్ వ‌ద్దు.. హైద‌రాబాద్ ముద్దు

sahoo-prabhas

ఇప్పుడు ప్ర‌భాస్ అండ్ సాహో టీం ఇదే అంటున్నారు మ‌రి. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రుగుంటే ఈ పాటికి సాహో టీం దుబాయ్ లో చక్క‌ర్లు కొడుతూ ఉండేవాళ్లు. అక్క‌డ యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రిస్తూ రోడ్ల‌పై బిజీ బిజీగా తిరిగేవాళ్లు. కానీ ఇప్పుడు అక్క‌డ షూటింగ్ జ‌ర‌గ‌డం లేదు. దుబాయ్ లో ప్ర‌భాస్ టీంకు ప‌ర్మిష‌న్ దొర‌క‌లేదు. జ‌న‌వ‌రి 5 నుంచే దుబాయ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నా.. అనుమ‌తి రాక‌పోవ‌డంతో హైద‌రాబాద్ లోనే మ‌రో షెడ్యూల్ ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు సుజీత్. అనుకున్న‌దే త‌డువుగా జ‌న‌వ‌రి 9 నుంచి సిటీలో సాహో షూటింగ్ మొద‌లు కానుంది. ప్ర‌భాస్ తో పాటు నీల్ నితిన్ ముఖేష్, శ్ర‌ద్ధాక‌పూర్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

దుబాయ్ షెడ్యూల్ ఇప్ప‌ట్లో కుదిరేలా లేదు. అందుకే జ‌న‌వ‌రి చివ‌రి వ‌ర‌కు హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్తి చేసి.. ఆ త‌ర్వాత‌ దుబాయ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే సుజీత్.. అత‌డితో పాటు సినిమాటోగ్ర‌ఫ‌ర్ మ‌ది.. స్టంట్ మాస్ట‌ర్ కెన్నీ బేట్స్ దుబాయ్ లో త‌మ‌కు కావాల్సిన లొకేష‌న్లలు ఫైన‌ల్ చేసుకుని వ‌చ్చారు. దుబాయ్ లో ఫ్లైయింగ్ స్క్వాడ్ యాక్ష‌న్ సీక్వెన్సులు.. ముఖ్యంగా అక్క‌డి బూర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర ప్లాన్ చేసిన  20 నిమిషాల యాక్ష‌న్ సీక్వెన్స్ ఇండియ‌న్ సినిమాల్లోనే నెవ‌ర్ బిఫోర్ అన్న‌ట్లుగా ఉంటుందంటున్నాడు సుజీత్. రుమేనియన్ కార్ చేజింగ్ సీన్స్.. ముంబై రోడ్ల‌పై భారీ ఫైట్ సీక్వెన్సులు.. ఇలా చాలా ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్.  ఈ చిత్రం క‌చ్చితంగా ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలో బెస్ట్ యాక్ష‌న్ మూవీగా నిలిచిపోతుంద‌ని భావిస్తున్నారు. మొత్తానికి మొన్న‌టి వ‌ర‌కు అమెరికాలోనే శిక్ష‌ణ తీసుకుని వ‌చ్చిన ప్ర‌భాస్.. ఇప్పుడు దాన్ని ఆచ‌ర‌ణ‌లో పెడుతున్నాడు.  

More Related Stories