English   

క‌రుణాక‌ర‌ణ్ కు డేట్ ఫిక్స్ చేసిన సాయి.. 

Sai-Dharam-Tej-And-Karunakaran-Movie-Fixed

వరస ఫ్లాపులతో ప్ర‌స్తుతం మెగా మేన‌ల్లుడు చాలా క‌ష్టాల్లో ఉన్నాడు. ఈయ‌న సినిమాల‌న్నీ ఇలా వ‌చ్చి అలా వెళ్తున్నాయి. ఈ మ‌ధ్యే వ‌చ్చిన జ‌వాన్ కూడా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయింది. జ‌వాన్ కు కాస్త పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా లేట్ కావ‌డం ఈ చిత్రానికి మైన‌స్ గా మారింది. దాంతో దిల్ రాజు మ్యాజిక్ కూడా ఈ సినిమాకు ప‌ని చేయ‌లేదు. దాంతో జ‌వాన్ జ్ఞాప‌కం మ‌రిచిపోడానికి అప్పుడే మ‌రో సినిమా మొదలు పెట్టేస్తున్నాడు.  ఇప్ప‌టికే వినాయ‌క్ సినిమా సెట్స్ పై ఉంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే స‌గానికి పైగా పూర్త‌యింది కూడా.

ఇది ఇలా ఉండ‌గానే ఇప్పుడు మ‌రో కొత్త సినిమా మొద‌లు పెట్టేస్తున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ఆ మ‌ధ్య ఓ సినిమాకు క‌మిట‌య్యాడు. డిసెంబ‌ర్ 12 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. నాన్ స్టాప్ గా రెగ్యులర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేయస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ప్రేమ‌క‌థ‌ల స్పెష‌లిస్ట్ అయిన క‌రుణాక‌ర‌ణ్.. సాయిధ‌రంతేజ్ తోనూ అలాంటి సినిమానే తెర‌కెక్కిస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. ఈయ‌నైనా సాయిధ‌రంతేజ్ కోరుకున్న విజ‌యాన్ని అందిస్తాడో లేదో..?

More Related Stories