English   

నాగ్ కోరిక తీరిందిగా..

Sam-And-Chai-s-Wedding-Reception-Is-Star-Studded-Affair

కొడుకు పెళ్లి ఘ‌నంగా జ‌ర‌పాల‌ని క‌ల‌లు క‌న్నాడు నాగార్జున‌. కానీ అది జ‌ర‌గ‌లేదు. వాళ్ల కుటుంబం వ‌ర‌కు బాగానే జ‌రిగినా.. రాష్ట్ర‌మంతా మాట్లాడే విధంగా అయితే జ‌ర‌గ‌లేదు. అందుకే రిసెప్ష‌న్ బాధ్య‌త తాను తీసుకున్నాడు నాగార్జున‌. నాగ‌చైత‌న్య‌, స‌మంత వెడ్డింగ్ రిసెప్ష‌న్ ఆకాశ‌మంత సంద‌డి మ‌ధ్య జ‌రిగింది. ఎన్ క‌న్వెన్ష‌న్ లో నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు.. రాజ‌కీయ ప్ర‌ముఖులు. ఏ ఒక్క‌ర్ని కూడా వ‌ద‌ల‌కుండా  అంద‌ర్నీ ఆహ్వానించాడు నాగార్జున‌. చైతూ పెళ్లిని మిస్ అయిన వాళ్లంద‌రూ రిసెప్ష‌న్ కు వ‌చ్చారు.

మ‌హేశ్, బాల‌య్య, ప‌వ‌న్ లాంటి హీరోలు మాత్రం షూటింగ్స్ తో బిజీగా ఉండ‌టంతో రాలేక‌పోయారు. చిరంజీవి,  రామ్ చ‌ర‌ణ్, బ‌న్నీ, అల్ల‌రి న‌రేష్.. ఇలా ప్రతీ ఒక్క‌రు వ‌చ్చి చైతూ, స‌మంత జంట‌ను ఆశీర్వ‌దించారు. ఈ రిసెప్ష‌న్ పూర్తైన త‌ర్వాత పార్టీ కూడా చేసుకున్నారంతా. పెళ్లి సంద‌డంతా పూర్తి కావ‌డంతో ఇక సినిమాల‌పై  దృష్టి పెట్ట‌నున్నారు స‌మంత‌, నాగ‌చైత‌న్య‌. ఇప్ప‌టికే స‌వ్య‌సాచితో పాటు మారుతి సిన‌మా కూడా ఒప్పుకున్నాడు చైతూ. ఇక స్యామ్ కూడా రంగ‌స్థ‌లంతో పాటు చాలా సినిమాలు చేస్తుంది.

More Related Stories