English   

ఆ వార‌సురాళ్లు కుమ్మేస్తున్నారు బాబోయ్.. 

suhana-newpics

తెలుగులో వార‌సురాళ్ల హ‌వా త‌క్కువ‌గా ఉంది కానీ బాలీవుడ్ లో మాత్రం వాళ్ల‌దే రాజ్యం. ఇక్కడ హీరోలు ఎలాగైతే కొత్త వాళ్ళు కాకుండా అంతా వార‌సుల‌తో నిండిపోయిందో అక్క‌డ హీరోయిన్లు కూడా అంతే. మ‌రొక‌రు ఛాన్సే లేకుండా అంతా వార‌సురాళ్లే దిగిపోతున్నారు. ఇప్ప‌టికే అక్క‌డున్న చాలా మంది హీరోయిన్లు కేరాఫ్ హీరోలు.. నిర్మాతల కూతుళ్లే. కరీనా క‌పూర్.. అలియాభ‌ట్.. శ్ర‌ద్ధాక‌పూర్.. సోనాక్షి.. తాజాగా శ్రీ‌దేవి కూతురు ఝాన్వి క‌పూర్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత అవుతుంది. ఈ మ‌ధ్య సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్.. షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా అందాల‌తో చంపేస్తున్నారు. 19 ఏళ్ల ఈ ముద్దుగుమ్మలు ఈ మ‌ధ్య ప్ర‌తీ వేడుక‌లో అందాల‌నే ఆయుధంగా వాడేస్తున్నారు. తండ్రులు సూప‌ర్ స్టార్స్ అని తెలిసినా కూడా గ్లామ‌ర్ షోకు మాత్రం అడ్డు చెప్ప‌డం లేదు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో వాళ్లే ఆ ముద్దుగుమ్మ‌ల‌ను మ‌రింత అందంగా సిద్ధం చేస్తున్నారు. నేడో రేపో వీళ్లు కూడా హీరోయిన్లు కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే షారుక్ త‌న‌యుడు హీరోగా వ‌స్తున్నాడ‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఇలాంటి టైమ్ లో కింగ్ ఖాన్ ముద్దుల త‌న‌య కూడా త‌న స్నేహితురాళ్ల‌తో క‌లిసి అందాల ఆర‌బోత‌లో పిచ్చెక్కిస్తుంది. మ‌రి ఈ వార‌సురాళ్లు వెండితెరపై తొలి అడుగెప్పుడో..? 

More Related Stories