English   

క‌మ‌ల్ దారిలో వెళ్తోన్న శ‌ర్వానంద్

Sharwanand-newmovie

అవును.. ఇప్పుడు శ‌ర్వానంద్ అదే చేస్తున్నాడు. తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న అతికొద్ది మంది న‌టుల్లో శ‌ర్వా కూడా ఒక‌రు. ఈయ‌నేం చేసినా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తుంటారు. కొత్త‌గా ట్రై చేయ‌డానికి శ‌ర్వా కూడా ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఇప్పుడు ఈ కుర్ర హీరో కెరీర్ మంచి జోరు మీదుంది. వ‌ర‌స‌గా విజ‌యాలు వ‌చ్చి ప‌డుతున్నాయి. ఆ మ‌ధ్య రాధా ఒక్క‌టి త‌ప్పితే గ‌త మూడేళ్లుగా శ‌ర్వానంద్ జోరు కొన‌సాగుతుంది. ఇక ఇప్పుడు రెండు సినిమాలు క‌మిట‌య్యాడు ఈ హీరో. అందులో ఒక‌టి సుధీర్ వ‌ర్మ సినిమా.. మ‌రోటి హ‌ను రాఘ‌వ‌పూడి సినిమా. ఇందులో సుధీర్ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. ఇందులో శర్వా కొన్ని సన్నివేశాల్లో ముస‌లివాడిలా కనిపించబోతున్నాడు. తెల్ల జుట్టు.. ముడతలు పడిన మొహంతో పెద్దాయ‌న‌గా క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఇందుకోసం శర్వానంద్‌తో ఓ స్పెషల్ ఫొటో షూట్ కూడా డిజైన్ చేశారు. ఈ గెటప్ ఇప్ప‌టికే ఖరారైపోయిందని తెలుస్తుంది. ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ముస‌లి  శ‌ర్వానంద్ ఎలా ఉండ‌బోతున్నాడో..? 

More Related Stories